తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Remuneration Hike Of 150 Crore For Thalapathy 68 Movie

Thalapathy Vijay Remuneration: తలపతి విజయ్‌కు భారీగా రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..!

17 May 2023, 18:29 IST

    • Thalapathy Vijay Remuneration: తలపతి విజయ్ తన పారితోషికాన్ని భారీగా పెంచేశారు. ఆయన తన తదుపరి చిత్రం కోసం ఏకంగా రూ.150 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
తలపతి విజయ్ రెమ్యూనరేషన్
తలపతి విజయ్ రెమ్యూనరేషన్

తలపతి విజయ్ రెమ్యూనరేషన్

Thalapathy Vijay Remuneration: తమిళ చిత్ర సీమలో టాప్ స్టారైన తలపతి విజయ్ వరుసగా హిట్ సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఆయన నుంచి మూవీ విడుదలైతే వందల కోట్లలో బిజినెస్ జరుగుతోంది. దీంతో విజయ్ అడిగినంత రెమ్యూనరేషన్‌ను ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా విజయ్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. ప్రస్తుతం ఆయన రూ.150 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం తలపతి 68 (Thalapathy 68) మూవీకి ఈ మొత్తన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

150 కోట్లతో ఇంత భారీ మొత్తాన్ని తీసుకుంటున్న సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ కావడం విశేషం. అంతేకాకుండా తన తదుపరి చిత్రాల లాభాల్లో కూడా మేజర్ షేర్ విజయ్‌కే వస్తుందని టాక్. కోలీవుడ్ రిపోర్టుల ప్రకారం డైరెక్టర్ వెంకట్ ప్రభు, ఏజీఎస్ నిర్మాణ సంస్థ ఇంటర్టైన్మెంట్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు భారీ మొత్తాన్ని విజయ్‌కు ఆఫర్ చేశారట. విజయ్ పారితోషికానికి సరిపడేంత సొమ్ము ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మనదేశంతో పాటు విదేశాల్లోనూ తలపతికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటం, తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ స్టార్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల 150 కోట్ల రెమ్యూనరేషన్ వర్తబులేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న విజయ్.. పలు వాణిజ్య ప్రకటనల ద్వారా రూ.10 కోట్ల వరకు ఏటా సంపాదిస్తున్నారు. దీంతో ఆయన సంపదను మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ వచ్చేసి రూ.445 కోట్ల పైనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా విజయ్‌ లగ్జరీ లైఫ్ స్టైల్‌ను మెయింటేన్ చేస్తున్నారు.

విజయ్ వద్ద లగ్జరీ కార్లు..

విజయ్‌కు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్5/ఎక్స్6, ఆడీ ఏ8 ఎల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్, ఫార్డ్ ముస్టాంగ్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ లాంటి విలాసవంతైన కార్లు ఉన్నాయి. అంతేకాకుండా చెన్నై సముద్రతీరానికి చేరువలో ఓ బంగ్లా ఉంది. 20 ఏళ్లకు పైగా సినీ ప్రయాణంలో విజయ్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన గత మూడు చిత్రాలు కూడా దాదాపు రూ.300 కోట్ల వరకు బిజినెస్ చేశాయి. గత చిత్రం వారసుడు రూ.350 కోట్ల పైగా వసూళ్లను సాధించింది. బీస్ట్ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించి రూ.227 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేసింది. అంతకుముందు చేసిన మాస్టర్ రూ.220 నుంచి 300 కోట్ల వరకు రాబట్టింది.

దీంతో మేకర్స్ ఆయన అడిగినంత అప్పజెప్పేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. భవిష్యత్తులో 150 కోట్ల కంటే ఎక్కువైనా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలాగే వరుసగా హిట్లు అందుకుంటే విజయ్ సినిమాలు అతి త్వరలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశముంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.