తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Box Office Collection Day 4: నాలుగో రోజు లైగ‌ర్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావ‌డం అసాధ్య‌మే

liger box office collection day 4: నాలుగో రోజు లైగ‌ర్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్ - బ్రేక్ ఈవెన్ కావ‌డం అసాధ్య‌మే

HT Telugu Desk HT Telugu

29 August 2022, 11:46 IST

  • liger box office collection day 4:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)హీరోగా నటించిన లైగర్ (Liger) సినిమా వసూళ్లు నాలుగో రోజు దారుణంగా పడిపోయాయి. ఆదివారం రోజు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Twitter)

విజయ్ దేవరకొండ

liger box office collection day 4: లైగర్ సినిమా వసూళ్లు నాలుగు రోజు పూర్తిగా పడిపోయాయి. ఆదివారం కావడంతో మోస్తారుగానైనా ఈ సినిమా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రోజు లైగర్ సినిమాకు కేవలం 58 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

శనివారం రోజు కోటి రూపాయల షేర్ ను రాబట్టగా ఆదివారం రోజు సగానికి తగ్గడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. ఆదివారం రోజు నైజాంలో ఇరవై లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా సండే నాడు కోటి పదిహేను లక్షల గ్రాస్, 58 లక్షల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 21.50 కోట్ల గ్రాస్, వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

హిందీలో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు 6.25 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఓవర్ సీస్ లో 3.30 కోట్ల వసూళ్లను సాధించింది. తొలిరోజు లైగర్ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నా నెగెటివ్ టాక్ కారణంగా రోజురోజుకు వసూళ్లు తగ్గుతూ వచ్చాయి.

నాలుగో రోజుకు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి అడుగులోనే అతడికి డిజాస్టర్ ఎదురైంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.