తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay At Varisu Success Party With Rashmika And Other Movie Team

Vijay at Varisu success party: వారసుడు టీమ్‌తో దళపతి విజయ్ సక్సెస్ పార్టీ.. ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu

25 January 2023, 17:03 IST

    • Vijay at Varisu success party: వారసుడు టీమ్‌తో దళపతి విజయ్ సక్సెస్ పార్టీ చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో విజయ్, రష్మికతోపాటు మిగతా మూవీ టీమ్ అంతా ఉంది.
వారిసు సక్సెస్ పార్టీలో మూవీ టీమ్
వారిసు సక్సెస్ పార్టీలో మూవీ టీమ్

వారిసు సక్సెస్ పార్టీలో మూవీ టీమ్

Vijay at Varisu success party: సంక్రాంతి సినిమాగా వచ్చిన అద్భుతమైన విజయం సాధించింది దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ. ఈ సినిమా ఇప్పుడు రూ.300 కోట్ల క్లబ్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసిన వారిసు మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ ఓ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Ranveer Singh: అల్లు అర్జున్ పాటకు స్టెప్స్ వేసిన రణ్‍వీర్ సింగ్.. వీడియో షేర్ చేసిన దేవీ శ్రీప్రసాద్

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

దీనికి విజయ్, రష్మికతోపాటు మూవీ టీమంతా హాజరైంది. ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన రాధిక, ఆమె భర్త శరత్ కుమార్, నటుడు శ్రీకాంత్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను రాధిక తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి.

విజయ్ ఈ పార్టీకి బ్లూ షర్ట్, బ్లాక్ డెనిమ్స్ లో వచ్చాడు. అటు రష్మిక బ్లాక్ ఔట్‌ఫిట్స్ లో కనిపించింది. పూర్తిగా నవ్వులతో సాయంత్రం సరదాగా గడిచిపోయిందని రాధిక ఈ ఫొటోలను షేర్ చేసుకుంది. మొత్తం మూవీ టీమ్ కెమెరాకు పోజులివ్వడంతోపాటు రాధిక భర్త శరత్ కుమార్.. విజయ్ తో దిగిన ఫొటో, తాను విజయ్, రష్మికలతో విడివిడిగా దిగిన ఫొటోలు కూడా ఇందులో ఉన్నాయి.

ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారిసు తమిళంలో జనవరి 11న, తెలుగులో వారసుడుగా జనవరి 14న రిలీజైంది. ఈ సినిమా ద్వారా విజయ్ తెలుగులో అడుగుపెట్టగా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లాడు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించారు. వారిసు మూవీ తమిళంలో భారీగా కలెక్షన్లు రాబట్టింది.

ముఖ్యంగా బీస్ట్ ఫ్లాప్ తర్వాత విజయ్ కి ఈ వారిసు మంచి హిట్ అందించింది. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ రిలీజ్ కాగా.. తొలి వారం మంచి కలెక్షన్లే సాధించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.