తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

29 April 2024, 19:43 IST

    • Krishnamma Movie: కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఏకంగా ఐదుగురు స్టార్ డైరెక్టర్లు హాజరుకానున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఈ ఈవెంట్‍లో పాల్గొననున్నారు. ఆ వివరాలివే..
Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు
Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Krishnamma Movie: యంగ్ హీరో సత్యదేవ్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ రిలీజ్‍కు సిద్ధమవుతోంది. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై సత్యదేవ్ మళ్లీ కనిపించనున్నారు. కృష్ణమ్మ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10వ తేదన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మే 1న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది. ఈ ఈవెంట్‍కు ఏకంగా ఐదుగురు స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా రానుండడం మరింత ఇంట్రెస్టింగ్‍గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

NNS Serial May 16th Episode: మిస్స‌మ్మ‌ను అవ‌మానించిన మ‌నోహ‌రి - త‌ల్లికి ఎదురుతిరిగిన అమ‌ర్ - నిజ‌మైన అరుంధ‌తి మాట‌

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

ఐదుగురు స్టార్ దర్శకులు

కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 1వ తేదీన జరగనుంది. హైదరాబాద్‍లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్‍లో మే 1 సాయంత్రం 6 నుంచి ఈవెంట్ ఉండనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

కృష్ణమ్మ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శకధీరుడు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, స్టార్ డైరెక్టర్లు సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని కూడా చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఒకే వేదికపైకి ఐదుగురు స్టార్ డైరెక్టర్లు రానున్నారు. దీంతో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది.

తెలుగు సినిమాలో ఇది గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని కృష్ణమ్మ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్‍కు బ్లాక్‍బస్టర్ డైరెక్టర్లు వస్తున్నారని ఈ విషయాన్ని వెల్లడించింది అరుణాచల క్రియేషన్స్.

కృష్ణమ్మ గురించి..

2000ల కాలం నాటి విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా కృష్ణమ్మ మూవీ ఉండనుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఫుల్ యాక్షన్ మోడ్‍లో సత్యదేవ్ లుక్ అదిరిపోయింది. అర్చనా అయ్యర్, అతిరా రాజ్, కృష్ణ బూర్గుల, లక్ష్మణ్ మీసాల ఈ మూవీలో కీరోల్స్ చేశారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు.

ఆ సినిమాల నుంచి అప్‍డేట్స్ ఏమైనా!

కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరువుతున్న స్టార్ డైరెక్టర్ల నుంచి వారి సినిమాలకు సంబంధించిన అప్‍డేట్స్ ఏమైనా వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్ మూవీ చేయనున్నారు. ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే, కృష్ణమ్మ ఈవెంట్‍లో రాజమౌళి ఈ చిత్రం గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి.

సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్‍తో మరో సినిమా చేయనున్నారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్‍తో దేవర మూవీ తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. అక్టోబర్ 10న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల కానుంది. దీంతో ఆయా సినిమాలకు సంబంధించి వీరి నుంచి ఏమైనా అప్‍డేట్లు వస్తాయా ఇంట్రెస్టింగ్‍గా మారింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం