SS Rajamouli Dance: ‘అందమైన ప్రేమరాణి’ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్-rajamouli dances for premikudu song andamaina premarani with his wife video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli Dance: ‘అందమైన ప్రేమరాణి’ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్

SS Rajamouli Dance: ‘అందమైన ప్రేమరాణి’ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 11, 2024 01:48 PM IST

SS Rajamouli Dance Video: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన భార్యతో కలిసి స్టెప్‍లు వేశారు. అందమైన ప్రేమరాణి పాటకు ఆయన డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

SS Rajamouli Dance: ‘అందమైన ప్రేమరాణి’ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్
SS Rajamouli Dance: ‘అందమైన ప్రేమరాణి’ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్

SS Rajamouli Dance: దేశంలోనే ప్రస్తుతం టాప్ డైరెక్టర్‌గా ఉన్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, గ్లోబల్ సెలెబ్రిటీల ప్రశంసలను కూడా ఆయన అందుకున్నారు. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన మూవీ చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. కాగా, ఇటీవల ఓ పెళ్లి వేడుకలో తన భార్య రమాతో కలిసి రాజమౌళి డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అయితే, అందుకోసం ఆయన అంతకు ముందే డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు. ఆ వీడియో తాజాగా బయటికి వచ్చింది.

అందమైన ప్రేమరాణి పాటకు..

ప్రభుదేవ హీరోగా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి’ పాటకు రాజమౌళి డ్యాన్స్ చేశారు. తన భార్య రమాతో కలిసి స్టెప్‍లు వేశారు. చాలా శ్రద్ధగా డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. మంచి గ్రేస్‍తో డ్యాన్స్ చేశారు దర్శక ధీరుడు.

రాజమౌళి డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ కూతురు వివాహంలో రాజమౌళి తన భార్యతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అంతకు ముందు ఈ రిహార్సల్స్ చేశారు. ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.

రాజమౌళి డ్యాన్స్ చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి స్టైలిష్‍గా, గ్రేస్‍తో ఆయన స్టెప్స్ వేశారని పొడుగుతున్నారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజమౌళి - మహేశ్ మూవీ

మహేశ్ బాబుతో రాజమౌళి తదుపరి చిత్రం (SSMB29) చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా.. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. గ్లోబల్ రేంజ్‍లో భారీ యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించనున్నారు. సుమారు రూ.1,000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుందని అంచనాలు ఉన్నాయి.

మహేశ్ - రాజమౌళి మూవీలో కొందరు హాలీవుడ్ నటీనటులు కూడా ఉంటారని తెలుస్తోంది. ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ కీలకపాత్ర పోషించడం దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍లో రాజమౌళి చాలా పాపులర్ అయ్యారు. దీంతో ఇంటర్నేషనల్ మార్గెట్‍ను కూడా టార్గెట్ చేస్తూ ఎస్ఎస్ఎంబీ29ను తీసుకురానున్నారు.

రాజమౌళితో చిత్రంలో మహేశ్ బాబు కొత్త లుక్‍లో కనిపించనున్నారని తెలుస్తోంది. లాంగ్ హెయిర్, గడ్డం, కండలు తిరిగిన దేహంతో ఆయన కనిపిస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం ఫిజికల్ ట్రైనింగ్ కోసం ఇప్పటికే జర్మనీకి కూడా కొన్ని రోజులు వెళ్లి వచ్చారు మహేశ్. ఈ సినిమాకు సుమారు రెండేళ్లకు పైగా సమయాన్ని ఆయన కేటాయించనున్నారట. 2026 రెండో అర్ధ భాగంలో లేకపోతే 2027 మొదట్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే ముందే ప్రెస్‍మీట్ పెట్టి కొన్ని వివరాలను రాజమౌళి వెల్లడిస్తారనే అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner