Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్: వీడియో-ssmb 29 mahesh babu returns to hyderabad from germany ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్: వీడియో

Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 04, 2024 05:59 PM IST

Mahesh Babu - SSMB 29: దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ కోసం మహేశ్ బాబు రెడీ అవుతున్నారు. ఇటీవల జర్మనీ వెళ్లిన ఆయన తిరిగి హైదరాబాద్‍కు వచ్చేశారు.

Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్ (Photo: X)
Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్ (Photo: X)

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో జనవరి 12న రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. మహేశ్ పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పించినా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓవరాల్‍గా ఈ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక తదుపరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మూవీ (SSMB 29) చేసేందుకు మహేశ్ బాబు రెడీ అయ్యారు. అత్యంత భారీ బడ్జెట్‍తో గ్లోబల్ రేంజ్‍ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది.

రాజమౌళితో చిత్రానికి సిద్ధమవడంలో భాగంగానే ఇటీవల జర్మనీకి వెళ్లారు మహేశ్ బాబు. నేడు (ఫిబ్రవరి 4) ఉదయం ఆయన హైదరాబాద్‍కు తిరిగి వచ్చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాలకు ఆయన చిక్కారు.

టీ షర్ట్‌పై బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకొని అదిరే లుక్‍లో కనిపించారు మహేశ్. దానికి మ్యాచ్ అయ్లేలా క్యాప్, సన్ గ్లాసెస్ ధరించారు. స్టైల్‍లోనూ కాస్త మార్పు చేశారు మహేశ్. నయా లుక్‍లో మరింత స్టైలిష్‍గా కనిపిస్తున్నారు మహేశ్. హైదరాబాద్‍ ఎయిర్‌పోర్టులో మహేశ్ నడిచి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రత్యేక ఫిట్‍నెస్ ప్రోగ్రాం కోసం జర్మనీకి వెళ్లారు మహేశ్ బాబు. రాజమౌళి చిత్రం కోసం ఉండేలా ఈ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అది ఫినిష్ కావటంతో ఇప్పుడు హైదరాబాద్‍కు తిరిగి వచ్చేశారు సూపర్ స్టార్.

షూటింగ్ అప్పటి నుంచేనా?

రాజమౌళితో చేయనున్న సినిమా మహేశ్ బాబుకు 29వ చిత్రం కావడంతో దీన్ని SSMB29 అని పిలుస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ మొదట్లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అంతకు ముందే రెండు యాడ్ షూట్లలో మహేశ్ పాల్గొంటారని తెలుస్తోంది. ఉగాది సందర్భంగా మహేశ్ - రాజమౌళి మూవీ షూటింగ్ మొదలవుతుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భారీ బడ్జెట్‍తో..

మహేశ్ - రాజమౌళి కాంబినేషన్‍లో ఈ చిత్రం సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందనుందని టాక్. హాలీవుడ్ రేంజ్‍లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా ఉండనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యారు. దీంతో SSMB 29ను గ్లోబల్ రేంజ్ మూవీగానే తీసుకురానున్నారు.

మరోవైపు, ఈ సినిమా కోసం మహేశ్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోరని కూడా ఇటీవల రూమర్స్ వచ్చాయి. రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా దక్కేలా అగ్రిమెంట్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో చేసే ఇతర నటీనటులతో పాటు టీమ్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

SSMB 29 చిత్రానికి స్క్రిప్ట్‌ పూర్తిగా సిద్ధమైందని రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే చెప్పారు. రాజమౌళితో ఈ చిత్రం కోసం మహేశ్ బాబు ఏకంగా రెండేళ్లకు పైగా కేటాయింటనున్నారట. ఈ సినిమా షూటింగ్‍ మొదలయ్యే ముందే రాజమౌళి, మహేశ్ బాబు కలిసి ఓ మీడియా సమావేశం నిర్వహిస్తారని టాక్ నడుస్తోంది. దీనిద్వారా కొన్ని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.