SS Rajamouli: రాజమౌళి సమర్పణలో రానున్న రెండు సినిమాలు.. సినిమాల పేర్లు కూడా ఫిక్స్.. బాలయ్య ఫేమస్ డైలాగ్‍తో ఓ టైటిల్-fahadh faasil new movies dont trouble the trouble and oxygen movies announced ss rajamouli presenting these films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Fahadh Faasil New Movies Dont Trouble The Trouble And Oxygen Movies Announced Ss Rajamouli Presenting These Films

SS Rajamouli: రాజమౌళి సమర్పణలో రానున్న రెండు సినిమాలు.. సినిమాల పేర్లు కూడా ఫిక్స్.. బాలయ్య ఫేమస్ డైలాగ్‍తో ఓ టైటిల్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2024 03:56 PM IST

SS Rajamouli - Fahadh Faasil: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో రెండు చిత్రాలు రానున్నాయి. ఈ సినిమాల అనౌన్స్‌మెంట్ ఒకేసారి వచ్చేసింది. ఈ రెండు చిత్రాల్లోనూ ఫాహద్ పాజిల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

SS Rajamouli: రాజమౌళి సమర్పణలో రానున్న రెండు సినిమాలు.. సినిమాల పేర్లు కూడా ఫిక్స్
SS Rajamouli: రాజమౌళి సమర్పణలో రానున్న రెండు సినిమాలు.. సినిమాల పేర్లు కూడా ఫిక్స్

SS Rajamouli: బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నేడు (మార్చి 19) వచ్చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ మలయాళం స్టార్ నటుడు, పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమాల వివరాలివే..

రాజమౌళి సమర్పణలో ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాలు రానున్నాయి. ఈ సినిమాల టైటిల్స్, ఫస్ట్ లుక్స్ కూడా నేడు రివీల్ చేసింది మూవీ టీమ్. ఆర్కా మీడియా పతాకంపై శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు కొత్త దర్శకులు తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందించనున్నారు.

ఆక్సిజన్ మూవీ

ఆక్సిజన్ సినిమాకు కొత్త డైరెక్టర్ సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహించనున్నారు. ఫ్రెండ్‍షిప్ ప్రధాన అంశంగా యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంట్రెంస్టింగ్‍గా ఉంది. మాస్క్ ధరించిన ఫాహద్ ఫాజిల్ ఫేస్‍పై మ్యాప్ ఉంది. ఫాదల్ కళ్లు చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ 2024లో మొదలవుతుందని మూవీ టీమ్ వెల్లడించింది.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ డ్రామాగా ఉండనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‍లో చిన్న పాపతో ఫాహద్ ఫాజిల్ ఉన్నారు. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ పేర్కొన్నారు.

శ్రీమన్నారాయణ చిత్రంలో నట సింహం నందమూరి బాలకృష్ణ చెప్పిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రుబల్’ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఈ టైటిల్‍తో ఇప్పుడు ఫాహద్ మూవీ వస్తోంది.

ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో తీసుకురానున్న మూవీ టీమ్ వెల్లడించింది.

రాజమౌళి నెక్ట్స్ మూవీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రాన్ని (SSMB29) తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ స్కేల్‍లో ఈ చిత్రం రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. దీంతో మహేశ్‍తో చిత్రాన్ని అత్యంత భారీగా రూపొందించేందుకు ఆయన సిద్ధమయ్యారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం తాజాగా జపాన్ వెళ్లారు రాజమౌళి. అక్కడ ఎస్ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్టు గురించి మాట్లాడారు. వేగంగానే ఈ సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‍లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. చిత్రీకరణ మొదలయ్యే కంటే ముందే ప్రెస్‍మీట్ పెట్టి కొన్ని వివరాలను రాజమౌళి వెల్లడిస్తారనే అంచనాలు ఉన్నాయి.

IPL_Entry_Point