SSMB29: మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి అదిరిపోయే అప్డేట్.. చాలా వేగంగా షూటింగ్.. ఇంకా ఏం చెప్పాడంటే..-ss rajamouli reveals his next movie with mahesh babu ssmb29 update he says shooting will be rapidly completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ss Rajamouli Reveals His Next Movie With Mahesh Babu Ssmb29 Update He Says Shooting Will Be Rapidly Completed

SSMB29: మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి అదిరిపోయే అప్డేట్.. చాలా వేగంగా షూటింగ్.. ఇంకా ఏం చెప్పాడంటే..

Hari Prasad S HT Telugu
Mar 19, 2024 08:45 AM IST

SSMB29: మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న అతడు.. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ సినిమాపై స్పందించాడు.

మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి అదిరిపోయే అప్డేట్.. చాలా వేగంగా షూటింగ్
మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి అదిరిపోయే అప్డేట్.. చాలా వేగంగా షూటింగ్

SSMB29: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ సినిమాపై స్పందించాడు. మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నాడని తెలుగు వారందరికీ తెలిసినా.. ప్రస్తుతం జపాన్ లో ఉన్న అతడు.. అక్కడి వాళ్లకు ఈ సినిమా గురించి వెల్లడించాడు. అతని గత మూవీ ఆర్ఆర్ఆర్ జపాన్ లో రిలీజై 500 రోజులకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. దీంతో రాజమౌళి ఆ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి జపాన్ వెళ్లాడు.

ఎస్ఎస్ఎంబీ29పై రాజమౌళి ఏమన్నాడంటే..

మహేష్ బాబుతో రాజమౌళి మూవీని ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇది 29వ సినిమా కానుండటంతో తాత్కాలికంగా ఈ టైటిల్ పెట్టారు. ఈ సినిమా గురించి జపాన్ ప్రేక్షకులకు రాజమౌళి వివరించాడు.

"నా నెక్ట్స్ మూవీని మేము ప్రారంభించాం. ఇప్పటికే స్టోరీ రాయడం పూర్తయింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సినిమా కోసం ప్రీవిజువలైజేషన్ చేస్తున్నాం. మూవీలో నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం మెయిన్ హీరోని మాత్రం ఎంపిక చేశాం.

అతని పేరు మహేష్ బాబు. అతని గురించి మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసినట్లుంది. అతడు చాలా అందగాడు. సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాను. సినిమా రిలీజ్ సమయంలో అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను" అని రాజమౌళి చెప్పాడు.

మహేష్ బాబు పేరు చెప్పగానే అక్కడున్న వాళ్లలో చాలా మంది గట్టిగా అరిచారు. దీంతో అతని గురించి మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసినట్లుంది అని రాజమౌళి అన్నాడు. ఎస్ఎస్ఎంబీ29 గురించి రాజమౌళి ఈ విషయాలు చెప్పడం ఇదే తొలిసారి. గతంలో మహేష్ తోపాటు రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడూ సినిమాపై అప్డేట్స్ ఇచ్చారు.

జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సునామీ

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజై ఈ మార్చి 25నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. జపాన్ లో ఈ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజైంది. అయితే అక్కడ కూడా 513 రోజులుగా ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో ఆడుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసమే రాజమౌళి తన భార్యతో కలిసి జపాన్ వెళ్లాడు. అక్కడ అతనికి ఘన స్వాగతం లభించింది.

థియేటర్లలో ప్రేక్షకుల కేరింతల మధ్య రాజమౌళి సినిమా చూశాడు. అక్కడి స్క్రీన్ పై మూవీ నడుస్తుండగా.. రాజమౌళి తన మొబైల్లో వీడియో కూడా తీశాడు. ఈ సందర్భంగా జపాన్ కు చెందిన ఓ 83 ఏళ్ల వృద్ధురాలు రాజమౌళికి ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. జపాన్ లో తమకు ఇష్టమైన వాళ్లకు ఇచ్చే ఓరిగామి క్రేన్లను ఆమె తయారు చేసి రాజమౌళికి ఇవ్వడం విశేషం.

ఈ విషయాన్ని అతడే తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. సదరు వృద్ధురాలికి ఆర్ఆర్ఆర్ మూవీ బాగా నచ్చడంతో ఆమె రాజమౌళికి ప్రేమతో వాటిని తయారు చేసి ఇచ్చింది. ఇక ఎస్ఎస్ఎంబీ 29 విషయానికి వస్తే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేస్తామని రాజమౌళి చెప్పడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

IPL_Entry_Point