Premalu Success Meet: ఈర్శ్యతో, బాధతో అయినా ఒప్పుకోవాలి.. మలయాళంలో అందరూ బెస్ట్ యాక్టర్స్: రాజమౌళి
- Premalu Success Meet: ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈర్శ్యతో, బాధతో అయినా మలయాళంలో అందరూ బెస్ట్ యాక్టర్స్ అని ఒప్పుకోవాలని అని అతడు అనడం విశేషం.
- Premalu Success Meet: ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈర్శ్యతో, బాధతో అయినా మలయాళంలో అందరూ బెస్ట్ యాక్టర్స్ అని ఒప్పుకోవాలని అని అతడు అనడం విశేషం.
(1 / 6)
Premalu Success Meet: మలయాళం మూవీ ప్రేమలును తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కు దర్శక ధీరుడు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
(2 / 6)
Premalu Success Meet: మలయాళం ఇండస్ట్రీలో అందరూ బెస్ట్ యాక్టర్స్ అని ఈ సందర్భంగా రాజమౌళి అన్నాడు. ఈ విషయాన్ని ఈర్శ్యతో, బాధతో అయినా ఒప్పుకోవాల్సిందే అని అనడం విశేషం.
(3 / 6)
Premalu Success Meet: తనకు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు పెద్దగా నచ్చవని, తనదంతా యాక్షన్, ఫైట్లే అని రాజమౌళి అన్నాడు. అయితే ప్రేమలు మూవీని తనకు అంతగా ఇష్టం లేకపోయినా వెళ్లి చూశానని, మొదటి నుంచీ చివరి వరకూ నవ్వుతూనే ఉన్నానని చెప్పాడు.
(4 / 6)
Premalu Success Meet: ప్రేమలు మూవీకి తెలుగులో డైలాగులు రాసిన 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యపై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. మలయాళంలో ఏ డైలాగ్స్ ఉన్నాయో తెలియదు కానీ.. తెలుగులో అతడు రాసిన డైలాగులు విని పడీపడీ నవ్వినట్లు చెప్పాడు. ఆ డైలాగులు రాసిన వ్యక్తి పేరు తెలియదని చెప్పడంతో పక్కనే ఉన్న ఆదిత్య వచ్చి తన పేరు చెప్పాడు.
(5 / 6)
Premalu Success Meet: ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ కు రాజమౌళితోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డైరెక్టర్లు అనుదీప్, అనిల్ రావిపూడి కూడా వచ్చాడు.
ఇతర గ్యాలరీలు