తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy 67 : లోకేష్ కనగరాజ్.. దళపతి 67లో ఆ స్టారో హీరోలు

Thalapathy 67 : లోకేష్ కనగరాజ్.. దళపతి 67లో ఆ స్టారో హీరోలు

Anand Sai HT Telugu

24 January 2023, 16:04 IST

    • Thalapathy 67 Movie : తమిళ హీరో దళపతి విజయ్ 67వ సినిమాకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మళ్లీ వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించనున్నట్టుగా చర్చ నడుస్తోంది.
దళపతి విజయ్ (ఫైల్ ఫొటో)
దళపతి విజయ్ (ఫైల్ ఫొటో) (twitter)

దళపతి విజయ్ (ఫైల్ ఫొటో)

తమిళ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) తన 67వ సినిమాతో ప్రేక్షుకలు ముందుకు రానున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌(Lokesh Kanagaraj)తో మళ్లీ కలుస్తున్నాడు. తాత్కాలికంగా దళపతి 67(Thalapathy 67) అని పేరు పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దళపతి 67 ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్ ఇప్పుడు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

లెజెండరీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan), చియాన్ విక్రమ్(Chiyaan Vikram) దళపతి 67లో నటించనున్నట్టుగా తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాలోని పాత్రకు కొనసాగింపుగా కమల్ పాత్ర ఉంటుందని టాక్ నడుస్తోంది. కమల్ సినిమా క్లైమాక్స్ లో కనిపించే అవకాశం ఉంది. మరోవైపు, చియాన్ విక్రమ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాలని భావిస్తున్నారని ఫిలీం సర్కిళ్లలో చర్చ ఉంది.

ఇటీవలి ఇంటర్వ్యూలలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాను ఖైదీ, విక్రమ్ రెండింటి సీక్వెల్స్‌లో పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. అనుకున్నట్లు జరిగితే దళపతి 67 విడుదలైన వెంటనే ఖైదీ 2 సెట్స్‌పైకి వెళ్లవచ్చు. తరువాత విక్రమ్ 2 నిర్మాణం ప్రారంభం కావొచ్చు. దీని తర్వాత సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్ తో సినిమా ఉండే అవకాశం ఉందని టాక్.

కమల్ హాసన్, కార్తీ, సూర్యతో సహా Lokesh Cinematic Universe అన్ని ప్రధాన పాత్రలు అయిన ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, నరేన్, అర్జున్ దాస్ లాంటి క్యారేక్టర్లు లోకశ్ తదుపరి చిత్రాల్లోనూ కనిపించే ఛాన్స్ ఉంది.

మరోవైపు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి(Rakshit shetty) ఇప్పుడు పాన్ ఇండియా(Pan India) స్థాయిలో పాపులారిటీ సంపాదించాడు. గతేడాది ఆయన నటించిన 'చార్లీ 777'(charlie 777) సినిమా దేశవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా 150 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 'చార్లీ 777' తర్వాత.. రక్షిత్ శెట్టికి వరుస ఆఫర్లు రావడం మెుదలు అయ్యాయి. ఇప్పుడు కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) 67వ చిత్రంలో అతను నటించే అవకాశం ఉంది. దళపతి 67 చిత్ర బృందం రక్షిత్ శెట్టితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం