తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Movie Update: 'కస్టడీ'లో సింధూరం హీరో.. విలక్షణ నటుడి హంట్ బిగిన్

Custody Movie Update: 'కస్టడీ'లో సింధూరం హీరో.. విలక్షణ నటుడి హంట్ బిగిన్

12 January 2023, 20:35 IST

    • Custody Movie Update: నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు రాబోతున్నాడు. ప్రముఖ నటుడు రామ్‌కీ కీలక పాత్ర పోషించనున్నాడు.
కస్టడీలో విలక్షన్ నటుడు రామ్‌కీ
కస్టడీలో విలక్షన్ నటుడు రామ్‌కీ

కస్టడీలో విలక్షన్ నటుడు రామ్‌కీ

Custody Movie Update: కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తోన్న తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాలో చై సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి లాంటి భారీ తారాగణం నటిస్తోన్న ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

కస్టడీ చిత్రంలో మరో విలక్షణ నటుడిని తీసుకున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. సింధూరం, ఒసేయ్ రాములమ్మ, ఆర్ఎక్స్100 లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన రామ్ కీ ఇందులో నటించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది.

ఇందులో నాగ‌చైత‌న్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య పోలీస్ రోల్ చేస్తున్న‌ది క్లియ‌ర్‌గా చెప్పేశారు చిత్ర యూనిట్‌. తెలుగులో వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు ఇళ‌య‌రాజా, ఆయ‌న త‌న‌యుడు యువ‌న్‌శంక‌ర్ రాజా సంయుక్తంగా సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.

ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ సినిమా కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.