తెలుగు న్యూస్  /  Entertainment  /  Varun Tej Gandeevadhari Arjuna Is The Most Expensive Film

Varun Tej Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా గాండీవధారి అర్జున

10 February 2023, 12:12 IST

    • Varun Tej Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అతడు నటించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

Varun Gandeevadhari Arjuna: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ గతేడాది గని లాంటి పరాజయాన్ని చవిచూడగా.. ఎఫ్3 లాంటి సూపర్ సక్సెస్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఆ సినిమానే గాండీవధారి అర్జున. పీఎస్వీ గరుడవేగ లాంటి సూపర్ హిట్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తారు.. వరుణ్ తేజ్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలను తీవ్రంగా పెంచేశారు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

గతేడాది అక్టోబరులో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీ కరణ ప్రస్తుతం విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంగ్లాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తిచేసుకుంది ఈ సినిమా. అనంతరం విదేశీ సాంకేతిక నిపుణుల సాయంతో భారీ యాక్షన్ సన్నివేశాల రూపొందించి షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి చిత్రబృందం లండన్‌కు షిఫ్టయింది. చిత్రీకరణ కోసం ఇతర ఐరోపా దేశాలకు కూడా వెళ్లనుంది.

హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ రిచ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందించనున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మునుపెన్నడూ చూడని అవతార్‌లో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు.

ఈ ప్రాజెక్టుకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. ముకేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎన్ఎస్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ ప్రమాణాలకు దీటుగా తెరకెక్కించనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.