Varun Tej Movie Update: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ మూవీ.. టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
Varun Tej Movie Update: టాలీవుడ్ వైవిధ్య చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Varun Tej Movie Update: ఎల్బీడబ్ల్యూ, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో గతేడాది ది ఘోస్ట్ అనే సినిమా విడుదలైంది. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా ఆశించిన విజయం అందుకోనప్పటికీ.. మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించారు. వీటీ12(VT12) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. జనవరి 19న ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించడంతో పోటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటీ, నటులు ఇతర సమాచారం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
వరుణ్ తేజ్ గతేడాది గని, ఎఫ్3 సినిమాలతో సందడి చేశాడు. ఇందులో గని సినిమా ఫ్లాప్ కాగా.. ఎఫ్3 మాత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే వరుణ్ తేజ్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. దీంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతోనైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
సంబంధిత కథనం