తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunny Leone Beach Video: సముద్ర తీరంలో చిల్ అవుతున్న సన్నీ.. ఫొటోషూట్‌తో అదరగొట్టిన ముద్దుగుమ్మ

Sunny Leone Beach Video: సముద్ర తీరంలో చిల్ అవుతున్న సన్నీ.. ఫొటోషూట్‌తో అదరగొట్టిన ముద్దుగుమ్మ

16 December 2022, 20:11 IST

  • Sunny Leone Beach Video: బాలీవుడ్ నటి సన్నీ లియోనీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. ఆరెంజ్ ఔట్ ఫిట్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది.

సన్నీ లియోన్
సన్నీ లియోన్

సన్నీ లియోన్

Sunny Leone Beach Video: బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఏ మాత్రం ఖాళీ దొరికినా సోషల్ మీడియాలో గడిపేస్తుంది. తన అభిమానులకు ఎప్పుడూ చేరువగా ఉంటూ తన గురించిన విశేషాలను తెలియజేస్తుంది. లేటేస్ట్ ఫొటోషూట్‌లు దిగి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరోసారి సన్నీ అదరగొట్టింది. సముద్రతీరంలో చిల్ అవుతూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Hansika Guardian Review: గార్డియన్ రివ్యూ - హ‌న్సిక లేటెస్ట్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

తన లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియోను సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. సముద్రం ఒడ్డున ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్‌లో దర్శన మిచ్చిన సన్నీ.. అందంగా వయ్యారాలు పోతూ ఫోజులిచ్చింది. ఇసుక తిన్నెలపై పడుకుని తన అందాల ప్రదర్శనను కొనసాగించింది. ఎంటీవీ స్ప్లిట్ విల్లా ఎక్స్4 షూటింగ్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ శుక్రవారం నాడు ఈ గ్లామరస్ వీడియోను పంచుకుంది.

ఇందులో భాగంగా ఫొటోషూట్‌లో పాల్గొన్న సన్నీ లియోనీ బిజీగా గడిపింది. నారింజ రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది. వీడియోలో తన సిబ్బంది పానీ ఆయా ఆయా (నీళ్లు వచ్చాయి) అంటూ అరవడం మనం గమనించవచ్చు. ఇందుకు ఆమె తన నవ్వును అదుపులో ఉంచుకుని మరీ ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ వీడియోను షేర్ చేసిన సన్నీ.. స్మైలీ ఎమోజీనీ జతచేసింది.

పోర్న్ ఇండస్ట్రీతో కెరీర్‍‌‌ను ప్రారంభించిన సన్నీ లియోనీ ఆ తర్వాత ఆ పరిశ్రమను వదిలిపెట్టి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. జిస్మ్ 2, హేట్ స్టోరీ 2, రాగిని ఎంఎంస్ 2, ఎక్ పహేలీ లీల లాంటి చిత్రాల్లో మరిచింది. తెలుగులో పీఎస్వీ గరుడ వేగలో ప్రత్యేక గీతంలో మెరవగా.. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నా మూవీలో నటించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.