తెలుగు న్యూస్  /  Entertainment  /  Anjali Starred Jhansi Season Web Series Will Streaming On January 2023

Anjali Jhansi 2 Web Series: మరోసారి థ్రిల్ చేయనున్న అంజలి.. ఝాన్సీ రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్

16 December 2022, 19:10 IST

    • Anjali Jhansi 2 Web Series: ప్రముఖ నటి అంజలి ఈ ఏఢాది నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. తాజాగా మరోసారి రానుంది. రెండో సీజన్‌ జనవరి నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఝాన్సీ 2 వెబ్ సిరీస్
ఝాన్సీ 2 వెబ్ సిరీస్

ఝాన్సీ 2 వెబ్ సిరీస్

Anjali Jhansi 2 Web Series: టాలీవుడ్ నటి అంజలి వరుస పెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది. హీరోయిన్ రోల్స్‌లోనే కాకుండా వెబ్ సిరీస్, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తమిళం, తెలుగులో ఇలా ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగులో ఝాన్సీ అనే వెబ్‌సిరీస్‌తో సందడి చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌తో ఆమెకు తెలుగులో మంచి ఆదరణ దక్కింది. త్వరలో ఈ సిరీస్‌కు సీక్వెల్ రాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి మంజుమ్మ‌ల్ బాయ్స్ - రెండు రోజులు ఆల‌స్యంగా స్ట్రీమింగ్‌

Faria Abdullah: అతని హైట్ మ్యాచ్ చేయడానికే ఫరియా.. జాతి రత్నాలు హీరోయిన్‌పై నిర్మాత కామెంట్స్

Chandini Chowdary: పవర్‌ఫుల్ పోలీస్‌గా గామి హీరోయిన్ చాందినీ చౌదరి.. బోల్డ్ బ్యూటితో కలిసి యేవమ్

Aquaman 2 OTT: ఓటీటీలోకి హాలీవుడ్ సూప‌ర్ హీరో మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఝాన్సీ సీజన్ 2కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జనవరి నుంచి ఈ రెండో భాగాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఝాన్సీ-2 పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సిరీస్‌లో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా మొదటి సారిగా ఆమె యాక్షన్ స్టంట్లతో అదరగొట్టింది. హౌస్ వైఫ్ పాత్రతో పాటు.. ప్రొఫెషనల్ ఫైటర్‌గా రెండు విభిన్న పాత్రల్లో అంజలి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్‌లో అసంపూర్ణంగా ఉన్న ప్రశ్నలకు ఈ రెండో భాగంలో సమాధానాలు ఇవ్వనున్నారు. గతం మరిచిపోయిన అమ్మాయిగా కనిపించిన అంజలి.. తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ సాగించే ప్రయాణమే ఝాన్సీ.

ఈ వెబ్ సిరీస్‌ను ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కృష్ణ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు తిరు ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా జోనర్‌లో ఇది రాబోతుంది. ఈ మొదటి భాగంలో అంజలితో పాటు చాందినీ చౌదరీ, అబ్‌రామ్, ఆదర్శ బాలకృష్ణ, శరణ్య, రాజ్ అర్జున్, కల్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 2023 నుంచి ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.