తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Michael Movie In Ott: ఓటీటీలోకి వచ్చేసిన మైఖేల్.. 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్

Michael Movie in OTT: ఓటీటీలోకి వచ్చేసిన మైఖేల్.. 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్

24 February 2023, 16:37 IST

    • Michael Movie in OTT: సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విడుదలైన 20 రోజుల్లో ఓటీటీలో సందడి చేసింది. రంజిత్ జీవకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజైంది.
సందీప్ కిషన్ మైఖేల్
సందీప్ కిషన్ మైఖేల్

సందీప్ కిషన్ మైఖేల్

Michael Movie in OTT: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రంజిత్ జీవకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించకపోవడంతో ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా వేదికగా ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.. వీడియో

Prabhas at Kannapa sets: కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులో మరో స్టార్

ఫిబ్రవరి 24 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ విడుదల సందర్భంగా సందీప్ కిషన్ తన అభిమానులకు మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. 2000 ఆహా సబ్‌స్క్రిప్షన్లు కానుకగా ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. అంతేకాకుండా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్. వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.

కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదలైంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.