తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sree Leela: ఉప్పెన హీరోతో రొమాన్స్ చేయ‌నున్న శ్రీలీల‌

Sree Leela: ఉప్పెన హీరోతో రొమాన్స్ చేయ‌నున్న శ్రీలీల‌

14 June 2022, 14:17 IST

  • పెళ్లి సంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. ఈ సినిమా స‌క్సెస్ సాధించ‌క‌పోయినా శ్రీలీల అదృష్టాన్ని మాత్రం మార్చివేసింది. తెలుగులో వ‌రుస అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటుంది ఈ సొగ‌స‌రి. తాజాగా ఆమె మెగా హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న‌ది...ఆ హీరో ఎవ‌రంటే...

శ్రీలీల
శ్రీలీల (instagram)

శ్రీలీల

అదృష్టం అంటే శ్రీలీల‌దే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సొగ‌స‌రి చేసింది ఒకే ఒక సినిమా. అది కూడా యావ‌రేజ్ గానే నిలిచింది. కానీ అవ‌కాశాలు మాత్రం భారీగా సొంతం చేసుకుంటోంది శ్రీలీల‌. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌డి సినిమాలో గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ల‌క్కీస్టార్ గా మారిపోయింది ఐదారు సినిమాల్లో న‌టిస్తోంది. ర‌వితేజ ధ‌మాకా, నితిన్-వ‌క్కంతం వంశీ ప్రాజెక్ట్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజుతో పాటు మ‌రికొన్ని చిత్రాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

తాజాగా ఈ సొగ‌స‌రి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది. మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ తో జోడీక‌ట్ట‌బోతున్న‌ది. ఉప్పెన‌, కొండ‌పొలం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. అత‌డు హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సంస్థ‌లు ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాయి. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా శ్రీలీల న‌టించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. శ్రీలీల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకిరానుంది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.