తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trivikram | మాటల మాంత్రికుడినీ వదలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. ఫొటో వైరల్‌

Trivikram | మాటల మాంత్రికుడినీ వదలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. ఫొటో వైరల్‌

HT Telugu Desk HT Telugu

04 April 2022, 19:43 IST

    • సెలబ్రిటీలు తమకు తాము అన్నింటికీ అతీతమని అనుకుంటారు. కానీ అలాంటి సెలబ్రిటీలను కూడా వదలడం లేదు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.
త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసు
త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసు (Twitter)

త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసు

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ మధ్య చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ల పేరుతో భారీగా చలాన్లు వేస్తున్నారు. సామాన్యులు, జర్నలిస్టులు, పోలీసులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరికీ జరిమానాల మోత మోగిస్తున్నారు. ఈ మధ్య వాహనాలపై ప్రెస్‌, పోలీసు వంటి అక్షరాలు రాసిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు ఉన్నా కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

తాజాగా టాలీవుడ్‌ మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కూడా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం ఉదయం పోలీసులు అతడు ప్రయాణిస్తున్న వెహికిల్‌ను ఆపారు. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో ఫైన్‌ వేశారు. అంతేకాకుండా అప్పటికప్పుడు ఆ అద్దాలకున్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండకూడదని కొన్నేళ్ల కిందటే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మొదట్లో వీటి పట్ల సీరియస్‌గా ఉన్న పోలీసులు తర్వాత చాలా కాలం పాటు పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌లతో ఇలాంటి కార్లను పట్టుకుంటున్నారు. ఈ మధ్యే టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్‌ల వెహికిల్‌ను కూడా ఆపి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.