తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Drugs Case | నేను డ్రగ్స్ తీసుకోలేదు...పోలీసుల విచారణకు సిద్ధం: రాహుల్

tollywood drugs case | నేను డ్రగ్స్ తీసుకోలేదు...పోలీసుల విచారణకు సిద్ధం: రాహుల్

Nelki Naresh HT Telugu

04 April 2022, 9:13 IST

  • డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో పోలీసుల విచార‌ణ‌కు తాను పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్‌.  తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని, అవి ఎలా ఉంటాయో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు.

రాహుల్ సిప్లిగంజ్‌
రాహుల్ సిప్లిగంజ్‌ (twitter)

రాహుల్ సిప్లిగంజ్‌

డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు బిగ్‌బాస్ విన్న‌ర్‌, గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్‌. ఎలాంటి విచార‌ణ‌కైనా తాను సిద్ధ‌మేన‌ని అన్నారు. బంజారాహిల్స్ లోని రాడిస‌న్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌పై పోలీసులు చేసిన దాడిలో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ ప‌బ్‌పై పోలీసులు దాడి చేసి 157 మంది యువ‌తీయువ‌కుల్ని అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  వారివివ‌రాల్ని పోలీసులు వెల్ల‌డించారు. ఇందులో నాగ‌బాబు త‌న‌య నిహారిక‌, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు సిద్ధార్థ్ తో పాటు ప‌లువురు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల పిల్ల‌లు ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ట్రెండింగ్ వార్తలు

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

Malayalam Movie: గుక్క‌తిప్పుకోకుండా ఒకేసారి ఈ మ‌ల‌యాళం మూవీ టైటిల్ చెప్ప‌గ‌ల‌రా? - ఓ సారి ట్రై చేయండి?

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

ఈ వ్య‌వ‌హారంపై  సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. స్నేహితుడి పుట్టిన‌రోజు కావ‌డంతో అత‌డు ఇన్వైట్ చేయడంతోనే తాను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి రాత్రి పదకొండున్నరకు పబ్ కు వెళ్లానని అన్నారు. అరగంట ఉండి ఫ్రెండ్‌ను విష్ చేసి వ‌ద్దామ‌ని అనుకున్నానని చెప్పారు.  ‘రాత్రి 1.30 నుండి 2 గంటల మధ్యలో పోలీసులు పబ్ కు వచ్చారు. అంద‌రితో పాటు న‌న్ను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. పోలీసులకు  పూర్తిగా సహకరించాను. నాకు భయపడాల్సిన అవసరం లేదు. మ‌ళ్లీ పోలీసులు విచారణకు పిలిస్తే తప్పకుండా వెళ‌తాను. స‌మ‌యానికి మించి ప‌బ్ న‌డిపితే ఓన‌ర్ ను అరెస్ట్ చేయాలి. లేదంటే డ్రగ్స్ తీసుకున్న వారిని  పట్టుకోవాలి. నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. అవసరమైతే డీఎన్ఏ టెస్ట్ చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం