తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela: ప‌వ‌న్ కళ్యాణ్ సినిమాలో పెళ్లి సంద‌డి హీరోయిన్‌....

Sreeleela: ప‌వ‌న్ కళ్యాణ్ సినిమాలో పెళ్లి సంద‌డి హీరోయిన్‌....

HT Telugu Desk HT Telugu

06 June 2022, 7:13 IST

  • మెగా మామాఅల్లుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ తొలిసారి క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే. త‌మిళ చిత్రం వినోద‌య‌సీత‌మ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు కనిపించనున్నారంటే..

శ్రీలీల‌
శ్రీలీల‌ (instagram)

శ్రీలీల‌

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కిన పెళ్లిసంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. ఈ సినిమాలో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌కు తెలుగులో ప‌లు అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది శ్రీలీల‌. ప్ర‌స్తుతం ర‌వితేజ ధ‌మాకాతో పాటు న‌వీన్ పొలిశెట్టితో అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాలు చేస్తోంది శ్రీలీల‌. అలాగే గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న భారీ బ‌డ్జెట్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

తాజాగా తెలుగులో శ్రీలీల మ‌రో బంఫ‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా  ఓ ఫాంటసీ డ్రామా చిత్రం రూపొందుతోంది.  త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న వినోధయ సీతమ్  ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.   త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ముద్ర‌ఖ‌ని తెలుగు వెర్ష‌న్ ను డైరెక్ష‌న్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. త‌న బాధ్య‌త‌లను నెరవేర్చకుండానే చ‌నిపోయిన ఓ మ‌ధ్య‌వ‌య‌స్కుడి క‌థ ఇది. తిరిగి బ‌తికే ఛాన్స్ వ‌స్తే ఏం చేశాడ‌నే పాయింట్‌కు వినోదాన్ని జోడిస్తూ రూపొందించారు.  

ప‌వ‌న్‌క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇమేజ్‌కు తగినట్లుగా తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. కాగా ఈసినిమాలో కథానాయికగా పెళ్లి సంద‌డి భామ శ్రీలీల‌ను ఎంపిక‌చేసిన‌ట్లు తెలిసింది.ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు జోడీగా ఆమె నటించనున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం