తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హిట్ సాంగ్‌ను టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్న శ్రీవిష్ణు

Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హిట్ సాంగ్‌ను టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్న శ్రీవిష్ణు

14 February 2023, 12:51 IST

  • Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలోని సూప‌ర్ హిట్ సాంగ్‌ను శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీకి టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ఏదంటే…

శ్రీవిష్ణు సామ‌జవ‌ర‌గ‌మ‌న
శ్రీవిష్ణు సామ‌జవ‌ర‌గ‌మ‌న

శ్రీవిష్ణు సామ‌జవ‌ర‌గ‌మ‌న

Sree Vishnu New Movie: రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ప్ర‌తి సారి కొత్త క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు శ్రీవిష్ణు. భ‌ళా తంద‌నాన‌, అల్లూరి వంటి యాక్ష‌న్ సినిమాల త‌ర్వాత పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైన‌ర్‌మెంట్ క‌థాంశంతో త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్నాడు శ్రీవిష్ణు.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

ఈ సినిమాకు సామ‌జవ‌ర‌గ‌మ‌న అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట పెద్ద హిట్ట‌యింది. ఈ పాట‌లోని ప‌ల్ల‌విని శ్రీవిష్ణు సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో శ్రీవిష్ణుతో పాటు వెన్నెల‌కిషోర్‌, న‌రేష్‌, హీరోయిన్ రెబా మోనికా క‌నిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వివాహ భోజ‌నంబు త‌ర్వాత రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. వేస‌విలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి హాస్య మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.