Sreevishnu Alluri OTT Release Date: శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌గా యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. థియేటర్లలో విడుదలైన పదిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది.
శుక్రవారం (నేడు) ఆహా ఓటీటీలో (Aha ott) రిలీజ్ కానుంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి అల్లూరి సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుందని ఆహా ప్రకటించింది. అల్లూరి సినిమాతో కయదు లోహర్ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా థియేటర్ రిలీజ్ సమయంలో అల్లూరి సినిమా కు సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులను శ్రీవిష్ణు పరిష్కరించినట్లు వార్తలొచ్చాయి.
అల్లూరి ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ హాజరుకావడంతో సినిమాకు హైప్ వచ్చింది. థియేటర్‌లో పాజిటివ్ టాక్ లభించినా పోటీగా పలు భారీ సినిమాలు విడుదలకావడంతో నిలదొక్కుకోలేకపోయింది. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీవిష్ణు చేసిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
ఇందులో అల్లూరి సీతారామరాజు అనే నిజాయితీపరుడైన పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు నటించాడు. తన సర్వీస్‌లో వివిధ కేసులను అల్లూరి ఎలా పరిష్కరించాడనే పాయింట్‌తో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.