తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Smitha On Bigg Boss: బిగ్‌ బాస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సింగర్‌ స్మిత

Singer Smitha on Bigg Boss: బిగ్‌ బాస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సింగర్‌ స్మిత

HT Telugu Desk HT Telugu

05 September 2022, 22:04 IST

    • Singer Smitha on Bigg Boss: బిగ్‌ బాస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది సింగర్‌ స్మిత. ప్రస్తుతం తెలుగు బిగ్‌ బాస్‌ 6 షో నడుస్తున్న సమయంలో ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.
సింగర్ స్మిత
సింగర్ స్మిత

సింగర్ స్మిత

Singer Smitha on Bigg Boss: బిగ్‌ బాస్‌ షో చాలా పాపులర్‌. మొదట హిందీలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తర్వాత తెలుగు, తమిళం, కన్నడల్లోకి వచ్చింది. ఓ సీజన్‌ ముగియగానే మరో సీజన్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్నో రోజుల ముందు నుంచే ఈ షోలో పార్టిసిపేట్‌ చేయబోయే కంటెస్టెంట్లు ఎవరు? ఈసారి షో ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

ప్రస్తుతం తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ప్రారంభానికి ముందు కూడా ఇలాంటి చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఈ షోలోకి సింగర్‌ స్మిత రాబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటి స్మిత ఇప్పుడీ షోపై సంచలన కామెంట్స్‌ చేసింది. తాను చచ్చినా ఈ షోకు వెళ్లనని, ఇది తనకు అసలు నచ్చదని ఆమె అనడం విశేషం. ఈ షోకు వెళ్తే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుందని చాలా మంది భావిస్తారు.

కానీ స్మిత వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. తాను ఈ షోకు వెళ్లనని, తన సన్నిహితులు ఎవరైనా వెళ్తా అన్నా కూడా తాను వద్దని చెబుతానని స్మిత అంటోంది. ఈ షో తనకు అస్సలు నచ్చదని కూడా స్పష్టం చేసింది. ఈ షో కోసం కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఓ ఇంట్లో అందరినీ ఉంచి, వాళ్ల మధ్య గొడవలు పెట్టడమేంటో తనకు అర్థం కాదని స్మిత అంటోంది.

ఈ బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే వాళ్లను తాను విమర్శించడం లేదని, అయితే తనకు మాత్రం ఈ షోకు వెళ్లడం ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 6లో 20 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.