తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan New Car: రూ.10 కోట్లు పెట్టి కారు కొన్న షారుక్ ఖాన్.. పఠాన్ సక్సెస్‌తో ఫుల్ జోష్

Shah Rukh Khan New Car: రూ.10 కోట్లు పెట్టి కారు కొన్న షారుక్ ఖాన్.. పఠాన్ సక్సెస్‌తో ఫుల్ జోష్

Hari Prasad S HT Telugu

27 March 2023, 19:06 IST

  • Shah Rukh Khan New Car: రూ.10 కోట్లు పెట్టి కారు కొన్నాడు షారుక్ ఖాన్. పఠాన్ సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడతడు. అంత ఖరీదైన కారు చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు.

షారుక్ ఖాన్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న రోల్స్ రాయిస్ కలినన్ కారు ఇదే
షారుక్ ఖాన్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న రోల్స్ రాయిస్ కలినన్ కారు ఇదే

షారుక్ ఖాన్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న రోల్స్ రాయిస్ కలినన్ కారు ఇదే

Shah Rukh Khan New Car: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత నటించిన మూవీ పఠాన్. రిలీజ్ కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లతో షారుక్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ఈ సక్సెస్ తో షారుక్ మాంచి ఊపు మీదున్నాడు. అదే ఊపులో అతడు ఏకంగా రూ.10 కోట్లు పెట్టి కారు కొన్నాడు. ఆ కారేంటో తెలుసా? రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్. ఇప్పటికే అతని దగ్గర ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్లోకి కొత్తగా ఈ రోల్స్ రాయిస్ వచ్చి చేరింది. నిజానికి తాను కొన్న కొత్త కారు గురించి షారుక్ ఏమీ చెప్పకపోయినా.. ముంబై రోడ్లపై 555 నంబర్ తో తిరుగుతున్న ఈ కారు అతనిదే అని ఇంటర్నెట్ లో బజ్ క్రియేట్ అయింది.

షారుక్ ఇల్లు అయిన మన్నత్ లోకి ఆ కారు వెళ్లిందని కూడా కొందరు సోషల్ మీడియాలో చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన నటుల్లో ఒకడిగా షారుక్ ఉన్నాడు. 2023 నాటికి అతని సంపద విలువ 75 కోట్ల డాలర్లు (సుమారు రూ.6152 కోట్లు)గా ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా పఠాన్ సక్సెస్ తో కింగ్ ఖాన్ రేంజ్ మరో స్థాయికి చేరింది.

షారుక్ దగ్గర ఇప్పటికే బుగాటీ, బెంట్లీ, బీఎండబ్ల్యూతోపాటు ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో ప్రతి కారు విలువ కోట్లలోనే ఉంటుంది. తాజాగా రోల్స్ రాయిస్ కలినన్ కారుతో ఈ కలెక్షన్ మరో రేంజ్ కు వెళ్లింది. ప్రస్తుతం పఠాన్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే కింగ్ ఖాన.. జవాన్, డంకీలాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ నెక్ట్స్ మూవీ టైగర్ 3లోనూ షారుక్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.

షారుక్ నటించిన పఠాన్ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాదు గతంలో కుచ్ కుచ్ హోతా హైలాంటి షారుక్ నటించిన సినిమాల్లోనూ సల్మాన్ కనిపించాడు. ఇక పఠాన్ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.