Rolls-Royce Spectre EV | రోల్స్ రాయిస్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఇదిగో!
- ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్, ఎట్టకేలకు తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం Rolls-Royce Spectre ను ఆవిష్కరించింది. ఈ కార్ ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.
- ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్, ఎట్టకేలకు తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం Rolls-Royce Spectre ను ఆవిష్కరించింది. ఈ కార్ ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.
(1 / 8)
రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్టర్ కార్ డెలివరీలు 2023 నాలుగో త్రైమాసికం నుంచి ప్రారంభమవుతాయి.
(2 / 8)
Rolls-Royce స్పెక్టర్ EV స్ప్లిట్ హెడ్‌లైట్ యూనిట్‌లతో, చుట్టుముట్టిన స్లిమ్ ఫ్రంట్ గ్రిల్‌తో ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంది.
(3 / 8)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV పూర్తిగా అల్యూమినియం బాడీతో రూపొందించారు. ఇది Rolls-Royce ఫాంటమ్, కుల్లినాన్ పోలికలను కలిగి ఉంటుంది.
(4 / 8)
రోల్స్ రాయిస్ తమ స్పెక్టర్ EV ని విడుదల చేయటానికి ముందు కొన్ని మిలియన్ కిలోమీటర్ల వరకు పరీక్షలు జరిపింది. దాని ICE మోడల్ ఫాంటమ్ కారుకు దగ్గరగా ఉండేలా ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది.
(5 / 8)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV గరిష్టంగా 577 హెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందించగలదు.
(6 / 8)
స్పెక్టర్ కేవలం 4.5 సెకన్లలో సున్నా నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని రోల్స్ రాయిస్ పేర్కొంది.
(7 / 8)
4,796 మృదువుగా ప్రకాశించే నక్షత్రాలను కలిగి ఉన్న స్టార్‌లైట్ డోర్స్‌తో స్పెక్టర్ అందుబాటులో ఉంది.
(8 / 8)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV కూడా దాని బానెట్ పై ఏరో-ట్యూన్డ్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ బొమ్మను కలిగి ఉంది
ఇతర గ్యాలరీలు