తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sanajay Dutt In Leo Movie: సంజూ వచ్చేశాడు.. లియో సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు

Sanajay Dutt in Leo Movie: సంజూ వచ్చేశాడు.. లియో సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు

12 March 2023, 7:20 IST

    • Sanajay Dutt in Leo Movie: బాలీవుడ్ హీరో సంజయ్ దత్.. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో సంజూ అడుగుపెట్టాడు.
లియో సెట్స్‌లో విజయ్-సంజయ్
లియో సెట్స్‌లో విజయ్-సంజయ్

లియో సెట్స్‌లో విజయ్-సంజయ్

Sanajay Dutt in Leo Movie: దళపతి విజయ్- కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన మాస్టర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే లోకేష్-విజయ్ కాంబినేషన్‌లో లియో అనే సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు. తాజాగా లియో మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లియో సెట్స్‌లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఇద్దరు పవర్ హౌస్ లాంటి నటులు విజయ్, సంజయ్ దత్ ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు. ఇటీవలే లియో మేకర్స్ అయిన సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ సంజూ.. లియోలో నటిస్తున్నాడనే అప్డేట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం సంజయ్ కశ్మీర్ వచ్చినట్లు మాంటేజ్ పోస్టును కూడా విడుదల చేశారు.

తాజాగా సంజయ్ దత్ లియో సెట్స్‌లో అడుగుపెట్టడంతో బజ్ ఏర్పడింది. ముఖ్యంగా విజయ్, సంజయ్ దత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం కశ్మీర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్ పళనీసామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.