తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha In Imdb List: అల్లు అర్జున్‌నే మించి పోయిన సమంత.. ఆ లిస్టులో నంబర్ వన్

Samantha in IMDb list: అల్లు అర్జున్‌నే మించి పోయిన సమంత.. ఆ లిస్టులో నంబర్ వన్

Hari Prasad S HT Telugu

03 May 2023, 15:46 IST

google News
    • Samantha in IMDb list: అల్లు అర్జున్‌నే మించి పోయింది సమంత. ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో నంబర్ వన్ గా నిలవడం విశేషం. ఆ లిస్టు ఏంటో ఓసారి చూద్దాం.
ఖుషీలో సమంత
ఖుషీలో సమంత

ఖుషీలో సమంత

Samantha in IMDb list: ఈ మధ్య వచ్చిన శాకుంతలం సినిమా సమంతకు పెద్ద షాకే ఇచ్చింది. చాలా రోజుల వెయిటింగ్, భారీ అంచనాలు, అంతకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. అయితే సమంతకు ఉన్న పాపులారిటీ మాత్రం తగ్గలేదని తాజాగా వచ్చిన వార్త ఒకటి స్పష్టం చేస్తోంది.

ఇప్పటికే ఆర్మాక్స్ లిస్టులో వరుసగా ఏడుసార్లు టాప్ లో ఉన్న సమంత.. తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ క్రమంలో ఆమె అల్లు అర్జున్, పూజా హెగ్డేలాంటి వాళ్లను కూడా వెనక్కి నెట్టింది. ప్రతి వారం ఈ లిస్టు రిలీజ్ అవుతుంది. గత వారం 9వ స్థానంలో ఉన్న సమంత.. ఇప్పుడు ఏకంగా టాప్ లోకి రావడం విశేషం.

ఇక ఈ లిస్టులో మరో టాలీవుడ్ నటి పూజా హెగ్డే 5వ స్థానంలో ఉంది. పుష్పతో నార్త్ లోనూ తన రేంజ్ పెంచుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 17వస్థానంలో ఉన్నాడు. ఇక అదే పుష్ప మూవీలో ఊ అంటావా పాటతో సమంత పాపులారిటీ నార్త్ లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తోపాటు యశోద, తాజాగా శాకుంతలంలోనూ ఆమె కనిపించింది.

దీంతో ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో సమంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ మధ్య ఆమె సిటడెల్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షో లండన్ లో జరగగా.. అక్కడ బ్లాక్ ఔట్‌ఫిట్ లో మెరిసిపోయింది. ఈ ఈవెంట్ కు ఆమె ఏకంగా రూ.6 కోట్లు విలువైన జువెలరీతో వచ్చింది. ఇదే సిటడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది.

ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీళ్ల డైరెక్షన్లోనే సామ్.. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ తోపాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ మూవీ చేస్తోంది.

తదుపరి వ్యాసం