Telugu Movies Releasing in May 2023: మే నెల‌లో సినిమాల పండుగ - బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌నున్న హీరోలు వీళ్లే-custody to ramabanam upcoming telugu movies releasing in may 2023 here full list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Movies Releasing In May 2023: మే నెల‌లో సినిమాల పండుగ - బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌నున్న హీరోలు వీళ్లే

Telugu Movies Releasing in May 2023: మే నెల‌లో సినిమాల పండుగ - బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌నున్న హీరోలు వీళ్లే

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2023 01:08 PM IST

Telugu Movies Releasing in May 2023: మే నెల‌లో అస‌లు సిస‌లైన సినిమాల విందును ప్రేక్ష‌కుల‌కు అందించేందుకు టాలీవుడ్ హీరోలు రెడీ అవుతోన్నారు. ఈ నెల‌లో ప‌లువురు తెలుగు హీరోలు త‌మ సినిమాల‌తో అభిమానుల ముందుకు రాబోతున్నారు.

నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ
నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ

Telugu Movies Releasing in May 2023: మే నెల‌లో సినీ ప్రేమికుల‌కు వినోదాన్ని పంచేందుకు టాలీవుడ్ హీరోలు సిద్ధ‌మ‌వుతోన్నారు. త‌మ సినిమాల‌తో ఈ నెల‌లో బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌బోతున్నారు. ఈ ఒక్క మంత్‌లోనే దాదాపు ఇర‌వై వ‌ర‌కు తెలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

అల్ల‌రి న‌రేష్ ఉగ్రం...

మే 5వ తేదీన గోపీచంద్ రామ‌బాణంతో పాటు అల్ల‌రి న‌రేష్ ఉగ్రం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. త‌మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌ను న‌మ్ముకొని అల్ల‌రి న‌రేష్, గోపీచంద్ ఈ వారం త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. రామ‌బాణం సినిమాకు శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఉగ్రం సినిమాకు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా వ్య‌వ‌హ‌రించారు.

రామ‌బాణం మూవీ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌క్క‌గా... ఉగ్రం మాత్రం పోలీస్ క‌థాంశంతో రూపొందింది. ఈ రెండు సినిమాల‌తో పాటుగా అరంగేట్రం, హీట్ సినిమాలు మే 5న రిలీజ్ కాబోతున్నాయి.

ఒకేరోజు ఐదు సినిమాలు...

మే 12న ఒకే రోజు ఐదు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీపైనే అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు,త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా క‌స్ట‌డీ రూపొందుతోంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

క‌స్ట‌డీతో పాటు అదే రోజు శ్రియా మ్యూజిక్ స్కూల్ రిలీజ్ కానుంది. శ‌ర్మాన్ జోషి, ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమాకు పాపారావు బియ్యాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. క‌స్ట‌డీతో పాటు మ్యూజిక్ స్కూల్ సినిమాల‌కు ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తోండ‌టం గ‌మ‌నార్హం. మే 12న సునీల్ భువ‌న విజ‌య‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాజేష్ ఫ‌ర్హానాతో పాటు ఏ డేంజ‌ర‌స్ గ‌ర్ల్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

శ్రీవిష్ణు వ‌ర్సెస్ సంతోష్ శోభ‌న్‌

మే 18న శ్రీవిష్ణు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, సంతోష్ శోభ‌న్ అన్నీ మంచి శ‌కున‌ములే మూవీస్ రిలీజ్ కానున్నాయి. అన్నీ మంచి శ‌కున‌ములే సినిమాకు నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా సినిమాకు రామ్ అబ్బ‌రాజు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. అలాగే విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు -2 కూడా మే 19న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

సిద్ధార్థ్ ట‌క్క‌ర్‌

మే లాస్ట్ వీక్‌లో ట‌క్క‌ర్ సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కార్తిక్ జీ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మిస్తోన్న‌రుద్రాంగి సినిమా మే 26న రిలీజ్ కానుంది. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ మూవీకి అజ‌య్ సామ్రాట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అలాగే మ‌రో తెలుగు మూవీ మెన్‌టూ కూడా మే 26న విడుద‌ల‌కాబోతున్న‌ది.

ఈ సినిమాల‌తో పాటుగా అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి జంట‌గా న‌టిస్తోన్న మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ మే 26న రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point