Samajavaragamana Glimpse: శ్రీవిష్ణు లవ్ స్టోరీలో ప్లాబ్లెం.. ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే?
Samajavaragamana Glimpse: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సామజవరగమన. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ రోజు అతడి పుట్టిన రోజు సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Samajavaragamana Glimpse: టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు.. విభిన్న తరహా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది అల్లూరి లాంటి మాస్ కమర్షియల్ సినిమాతో ముందుకొచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు తనకు బాగా నప్పే లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అదే సామజవరగమన. ఈ రోజు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
రామ్ అబ్బరాజు దర్శఖత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రత్యేక వీడియో ఆసక్తికరంగా సాగింది. ప్రతి లవ్ మ్యారేజ్‌లో క్యాస్ట్ ప్లాబ్లం ఉంటుంది లేదా క్యాష్ ప్రాబ్లం ఉంటుంది.. కానీ నా లవ్ స్టోరీలో ఇలాంటి ప్లాబ్లమ్ ఉంటుందా? అంటూ చెప్పే డైలాగ్ సినిమా ఆసక్తిని పెంచింది. ఈ వీడియోను బట్టి చూస్తే ఇందులో హీరో లవ్ స్టోరీలో ఏదో సమస్య ఉంటుందని అర్థమవుతుంది. అదేంటనేది మాత్రం ఇందులో చెప్పలేదు. తప్పకుండా ఏదో విచిత్రమైన సమస్యే ఉంటుందని ఈ వీడియోను బట్టి తెలుస్తోంది.
అమాయకుడైన యువకుడి క్యారెక్టర్‌లో శ్రీ విష్ణు బాగా ఒదిగిపోయాడు. రెబా మోనికా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. తన పర్ఫార్మెన్స్‌తో శ్రీ విష్ణు ఆకట్టుకున్నాడు. స్టోరీని బట్టి చూస్తే ఇది యూనిక్ కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. సామజవరగమన టైటిల్ ఆడియెన్స్‌కు ఇంకా ఆసక్తికరంగా మార్చింది. గోపీసుందర్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తోంది.
రెబా మోనికా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకంపై అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
టాపిక్