Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హిట్ సాంగ్‌ను టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్న శ్రీవిష్ణు-sree vishnu next movie titled samajavaragamana first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sree Vishnu Next Movie Titled Samajavaragamana First Look Unveiled

Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హిట్ సాంగ్‌ను టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్న శ్రీవిష్ణు

Nelki Naresh Kumar HT Telugu
Feb 14, 2023 12:51 PM IST

Sree Vishnu New Movie: అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలోని సూప‌ర్ హిట్ సాంగ్‌ను శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీకి టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ఏదంటే…

శ్రీవిష్ణు సామ‌జవ‌ర‌గ‌మ‌న
శ్రీవిష్ణు సామ‌జవ‌ర‌గ‌మ‌న

Sree Vishnu New Movie: రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ప్ర‌తి సారి కొత్త క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు శ్రీవిష్ణు. భ‌ళా తంద‌నాన‌, అల్లూరి వంటి యాక్ష‌న్ సినిమాల త‌ర్వాత పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైన‌ర్‌మెంట్ క‌థాంశంతో త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్నాడు శ్రీవిష్ణు.

ఈ సినిమాకు సామ‌జవ‌ర‌గ‌మ‌న అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట పెద్ద హిట్ట‌యింది. ఈ పాట‌లోని ప‌ల్ల‌విని శ్రీవిష్ణు సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో శ్రీవిష్ణుతో పాటు వెన్నెల‌కిషోర్‌, న‌రేష్‌, హీరోయిన్ రెబా మోనికా క‌నిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వివాహ భోజ‌నంబు త‌ర్వాత రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. వేస‌విలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి హాస్య మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

IPL_Entry_Point