Pooja Hegde on SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతారట-pooja hegde reveals mahesh and her looks surprise their fans in ssmb28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pooja Hegde On Ssmb28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతారట

Pooja Hegde on SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతారట

Maragani Govardhan HT Telugu
Apr 20, 2023 09:11 AM IST

Pooja Hegde on SSMB28: మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 మూవీ గురించి పూజా హెగ్డే ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో సూపర్ స్టార్‌, తన లుక్స్ సరికొత్తగా ఉంటాయని స్పష్టం చేసింది.

మహేష్ బాబు-పూజా హెగ్డే
మహేష్ బాబు-పూజా హెగ్డే

Pooja Hegde on SSMB28: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. అది కూడా స్టార్ హీరోల సరసన చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న SSMB28లోనూ చేస్తోంది. ప్రస్తుతం సల్మాన్ సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగా మహేష్‌తో సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది పూజ.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే కూడా పాల్గొంటోంది. మహేష్ సరసన మరోసారి నటించడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ చాలా భిన్నంగా ఉంటుందని, సరికొత్తగా కనిపస్తానని స్పష్టం చేసింది. అలాగే మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించింది. వాయిస్ మాడ్యూలేషన్‌లో సూపర్ స్టార్ కంట్రోల్‌కు తాను ఫిదా అయినట్లు చెప్పింది. ఇందులో ఆయన ఇంతకుముదెన్నడూ చూడని రూపంలో కనిపిస్తారని స్పష్టం చేసింది.

పూజా హెగ్డే.. మహేష్ బాబుతో కలిసి ఇప్పటికే మహర్షి సినిమాలో నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SSMB28లోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో పూజాతో పాటు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్‌గా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ప్రస్తుతం పూజా.. సల్మాన్ ఖాన్‌తో చేసిన కిసీ కా భాయ కిసీ కా జాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిందీ ఆడియెన్స్‌ను అలరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేసింది. ఇందులో షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, సిద్ధార్థ్ నిగమ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 21న ఈద్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Whats_app_banner