IMDb Most Popular Indian Actors: ఫ్యాన్ బేస్‌లో సౌత్ హీరోల ఆధిపత్యం.. ఐఎండీబీ టాప్-10 లిస్టులో చరణ్, తారక్-imdb announced most popular top 10 indian actors and actresses ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imdb Most Popular Indian Actors: ఫ్యాన్ బేస్‌లో సౌత్ హీరోల ఆధిపత్యం.. ఐఎండీబీ టాప్-10 లిస్టులో చరణ్, తారక్

IMDb Most Popular Indian Actors: ఫ్యాన్ బేస్‌లో సౌత్ హీరోల ఆధిపత్యం.. ఐఎండీబీ టాప్-10 లిస్టులో చరణ్, తారక్

Maragani Govardhan HT Telugu
Dec 07, 2022 01:02 PM IST

IMDb Most Popular Indian Actors: ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ.. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో సౌత్ హీరోలా ఆధిపత్యం కనిపించింది. హీరోల్లో హృతిక్ రోషన్ మినహా మిగిలినవారంతా దక్షిణాదివారు కావడం గమనార్హం.

ఐఎండీబీ ర్యాంకింగ్స్
ఐఎండీబీ ర్యాంకింగ్స్

IMDb Most Popular Indian Actors: ప్రఖ్యాత మూవీ రేటింగ్ పోర్టర్ ఐఎండీబీ(IMDb) ర్యాంకింగ్స్‌లో దక్షిణాది యాక్టర్లు ముందు వరుసలో నిలిచారు. అందులో తెలుగు హీరోలు ముగ్గురు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐఎండీబీ ప్రకటించిన 2022 ర్యాంకింగ్స్‌లో సౌత్ నటీ, నటుల ఆధిపత్యం కనిపించింది. ఈ సంవత్సరం IMDbలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఫ్యాన్ బేస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను వెలువరించింది. అందరింకంటే ముందు వరుసలో తమిళ హీరో ధనుష్ అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

కొన్ని తమిళ చిత్రాలు, ఓ బాలీవుడ్, ఓ హాలీవుడ్ చిత్రం మినహా పాన్ ఇండియా సినిమాలు చేయని ధనుష్‌ ఐఎండీబీ టాప్-10లో స్థానం దక్కించుకున్నాడు. అనంతరం గంగూబాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్, డార్లింగ్స్ లాంటి చిత్రాలతో ఆదరణ పొందిన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ 3వ స్థానాన్ని సాధించింది.

ఆర్ఆర్ఆర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నాలుగో స్థానంలో నిలవగా.. జూనియర్ ఎన్టీఆర్ 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేజీఎఫ్‌ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కన్నడ హీరో యశ్ 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోపక్క బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తను నటించిన విక్రమ్ వేద ఫ్లాప్ అయినప్పటికీ.. ఆరో స్థానంలో ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 5వ స్థానంలో, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 7వ స్థానంలో నిలిచారు.

పుష్ప చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టాప్-10 జాబితాలో హృతిక్ రోషన్ మినహా మిగిలిన హీరోలంతా దక్షిణాది నటులు కావడం గమనార్హం. అందరికంటే అగ్రస్థానంలో ధనుష్ అగ్రస్థానంలో ఉన్నారు. తిరుచిత్రాంబలం, గ్రే మ్యాన్ లాంటి బహుభాషా చిత్రాలతో ఆయన విశేష ఆదరణ పొందారు.

IMDb ప్రకారం 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలు..

1. ధనుష్

2. అలియా భట్

3. ఐశ్వర్య రాయ్ బచ్చన్

4. రామ్ చరణ్ తేజ

5. సమంతా రూత్ ప్రభు

6. హృతిక్ రోషన్

7. కియారా అద్వానీ

8. ఎన్.టి. రామారావు జూనియర్

9. అల్లు అర్జున్

10. యష్.

Whats_app_banner

సంబంధిత కథనం