Sir Movie Release Date: ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?-dhanush starred bilingual movie sir release on 2023 february 17th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sir Movie Release Date: ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Sir Movie Release Date: ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
Nov 17, 2022 06:50 PM IST

Sir Movie Release Date: కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయాలని నిర్ణయించారు.

సార్ రిలీజ్ డేట్
సార్ రిలీజ్ డేట్

Sir Movie Release Date: కోలీవుడ్ యాక్టర్ ధనుష్ ఎట్టకేలకు ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. అదే సార్. వెంకీ అట్లూరీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, గ్లింప్స్, పాటలు విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టమైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను వాతి పేరుతో విడుదల చేయనున్నారు. ధనుష్ సరసన ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం ముగింపు దశలో ఉంది. కావున వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు మేకర్స్. ఈ రోజు అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో కథనాయకుడు ధనుష్ కళశాల మెట్లపై ఎంతో స్టైల్‌గా కూర్చుని ఉండటం గమనించవచ్చు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలై మాస్టారు మాస్టారు గీతం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

విద్యా వ్యవస్థ తీరు తెన్నులపై సాగే కథాంశంతో సార్ చిత్రం తెరకెక్కుతోంది. అంతేకాకుండా సామాజిక స్పృహను కలిగించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌తో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం