Dhanush Sir First Single: ధనుష్ నటించిన 'సార్' నుంచి మొదటి పాట వచ్చేసింది.. మెలోడీ అదిరింది
Dhanush Sir First Single: కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్ నుంచి మొదటి విడదలైంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. డిసెంబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది.
Dhanush Sir First Single: కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న సరికొత్త ద్విభాషా చిత్రం సార్. ఈ సినిమాకు తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా చిత్రబృందం మరో సరికొత్త అప్డేట్‌తో ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. మాస్టారు మాస్టారు అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
మాస్టారు అంటూ సాగే ఈ మెలోడీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. శ్వేతా మోహన్ ఆలపించిన ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో ఆయన ఫ్లూట్ వినియోగించిన తీరు బాగుంది. వినడానకి చాలా వినసొంపుగా అనిపిస్తుంది. ఆరంభంలో ఈ మ్యూజిక్ శ్రోతలను కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. వింటుంటే చాలా ప్రశాంతమైన భావనను కలిగిస్తుంది.
శ్వేతా మోహన్ ఆలపించిన ఈ గీతాన్ని ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ ఆలపించారు. తాజాగా విడుదలైన ఈ లిరికల్ సాంగ్‌లో ధనుష్-సంయుక్త మీనన్ జోడీ చాలా క్యూట్‌గా ఉంది. ఈ పాటలో ధనుష్ చాలా యంగ్‌గా కనిపించాడు. హాఫ్ స్లీవ్ షర్టుల్లో ఆకట్టుకున్నాడు. ప్రియుడును అమితంగా ప్రేమించే ప్రేయసి కోణంలో నుంచి ఈ పాటను రాసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ధనుష్ ఎడ్యుకేషన్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు.
ధనుష్, సంయుక్త మీనన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సీతార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వంశీ పైడిపల్లి తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం