తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sabari: ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

Sabari: ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

14 April 2024, 6:55 IST

  • Varalaxmi Sarathkumar Sabari Trailer Launch: ఇటీవల కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై శబరి మూవీ నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఆసక్తికకర కామెంట్స్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ బయట ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతాను అంటూ మాట్లాడారు.

ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్
ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

ఆ కోలీవుడ్ హీరోయిన్ బిహేవియర్ గురించి చెబుతాను.. నిర్మాత కామెంట్స్

Sabari Producer Mahendra Nath Kondla: తమిళ పాపులర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. 2012లో పోడా పోడి సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ తర్వాత అంతగా క్లిక్ కాలేదు. అనుకున్న రేంజ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ, పలు తమిళ సినిమాల్లో విలన్‌గా నటించి బాగా పేరు తెచ్చుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Tabu in Dune series: ఆ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర చేయబోతున్న బాలీవుడ్ నటి

Guppedantha Manasu May 14th Episode: గుప్పెడంత మనసు- తన ఉచ్చులో తానే పడిన శైలేంద్ర- పిచ్చోడిన చేసిన మహేంద్ర, వసుధార

GV Prakash Kumar: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. మానసిక ప్రశాంతత కోసమే అంటూ..

Krishna mukunda murari serial: కృష్ణని గొడ్రాలన్న మీరా.. ముకుందకు ప్రపోజ్ చేసేందుకు ఫిక్స్ అయిన ఆదర్శ్

పాన్ ఇండియా స్థాయిలో

హీరోయిన్‌గా కంటే నటిగా చాలా పాపులర్ అయింది వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగులో నాంది, క్రాక్ సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. క్రాక్, వీరసింహా రెడ్డి, యశోద సినిమాల్లో నెగెటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది. గతేడాది హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది వరలక్ష్మీ.

తెలుగు హీరోలు

అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన శబరి సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మే 3న విడుదల కానుంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల శబరి మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వరుణ్ సందేశ్ విచ్చేయగా.. బిగ్ బాస్ అమర్ దీప్ అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌పై నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బిహేవియర్ గురించి చెబుతా

''ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్ గారికి థాంక్స్. నా రెండో సినిమా ఆయనతో చేస్తున్నా. ఆ తర్వాత మూడో సినిమా అమర్ దీప్ హీరోగా చేస్తున్నాను. ఆయనకూ థాంక్స్. ఈ శబరి సినిమాకుకి వస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ గారి పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు. ఆవిడ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ (బయటి ప్రవర్తన) గురించి చెబుతా'' అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అన్నారు.

నిర్మాతకు ఎంత లాస్

''మేం కొడైకెనాల్ షెడ్యూల్ చేశాం. వంద మందితో 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. రెండో రోజు వర్షంలో ఒక సీన్ తీయాలని ప్లాన్ చేశాం. ఆ రోజు ఆవిడ రెయిన్ సీన్ చేయనని చెప్పారని కో డైరెక్టర్ వంశీ చెప్పారు. నేను అప్ సెట్ అయ్యాను. అరగంట తర్వాత మళ్లీ వచ్చారు. 'వంద మందితో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రెండో రోజు ఈ సీన్ చేయడం వల్ల నేను సిక్ అయితే నిర్మాతకు ఎంత లాస్? ఆయన ఏమైపోతారు? ఆలోచించారా? లాస్ట్ డే ఈ సీన్ పెట్టండి. నేను చేస్తాను' అని మేడం చెప్పారు'' అని నిర్మాత తెలిపారు.

నిర్మాత బతికి ఉంటేనే

''నిర్మాత గురించి ఆలోచించే ఆరిస్టులు ఉండాలి. నిర్మాత బతికి ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. మే 3న ఈ సినిమా విడుదల అవుతోంది. నిర్మాతగా నా తొలి సినిమా ఇది. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని శబరి ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల చెప్పారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం