Varun Sandesh: కోలీవుడ్ హీరోయిన్‌తో నటించాలని ఉంది.. హ్యాపీ డేస్ హీరో కామెంట్స్
Varun Sandesh About Varalaxmi Sarathkumar: హ్యాపీ డేస్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత పలు సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్‌తో నటించాలని ఉందని శబరి ట్రైలర్ లాంచ్‌లో తెలిపాడు.
Varun Sandesh Sabari Trailer Launch: హ్యాపీ డేస్ మూవీతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ మూవీ తర్వాత కొత్త బంగారు లోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ, మరో చరిత్ర, ఇందువదన వంటి సినిమాలతో అలరించాడు. ఎంతోమంది హీరోయిన్లతో యాక్ట్ చేసిన వరుణ్ సందేశ్ తాజాగా కోలీవుడ్ నటితో యాక్ట్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.
తమిళ పాపులర్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అవుతోంది. శుక్రవారం అంటే ఏప్రిల్ 12న ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
వరుణ్ సందేశ్ శబరి మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేస్తే.. తమిళ ట్రైలర్‌ను నిర్మాత మహేంద్రనాథ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''నిర్మాత మహేంద్రనాథ్ గారి కోసం ఇక్కడికి వచ్చాను. నేను చాలా సినిమాలు చేశా. చాలా మంది దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యాను. మహేంద్ర గారు ఇతరులకు ఇచ్చే గౌరవం చూసి, ఆయన వ్యక్తిత్వానికి నేను ఫిదా అయ్యా. ఆయనతో నేను ఓ సినిమా చేస్తున్నా'' అని వరుణ్ సందేశ్ అన్నారు.
''మైఖేల్ సినిమాలో నేను, వరలక్ష్మి గారు నటించాం. అయితే, మా కాంబినేషన్‌లో సీన్స్ లేవు. ఆవిడతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. శబరి ట్రైలర్ బాగుంది. మే 3న సినిమా విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను'' అని వరుణ్ సందేశ్ కోలీవుడ్ హీరోయిన్ అయినా వరలక్ష్మీ శరత్ కుమార్‌తో నటించాలని ఉందని చెప్పారు.
''చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఆనందంగా ఉంది. నాకు ఏప్రిల్ 11 మెమరబుల్ డే. నా తొలి సినిమా 'ఐతే' 21 ఏళ్ల క్రితం ఈ రోజే విడుదల అయింది. అదే రోజు 'శబరి' ట్రైలర్ విడుదల అయింది. సో, నాకు డబుల్ స్పెషల్. నేను కూడా ట్రైలర్ ఇప్పుడే చూశా. స్టన్నింగ్ ట్రైలర్. ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు'' అని యాక్టర్ శశాంక్ తెలిపాడు.
''ఈ సినిమాలో నేను నటించా కాబట్టి విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో లాయర్ రోల్ చేశా. మే 3న థియేటర్లకు వెళ్లి చూడండి. నిర్మాత మహేంద్రనాథ్ కోసం ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ హౌస్ పెర్ఫార్మర్. ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి స్టన్ అవుతారు'' అని శశాంక్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, అనేక సినిమాలతో అలరించిన వరుణ్ సందేశ్ 2019లో స్టార్ మా రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తెలుగు 3 సీజన్‌లో పాల్గొన్నాడు. ఇందులో వరుణ్ సందేశ్ తన భార్య వితికతో పాటు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుని 4వ స్థానంలో వరుణ్ సందేశ్ నిలిచాడు.