Brahmamudi October 19th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాహుల్‌కు మైఖేల్ వార్నింగ్.. నిలదీసిన స్వప్న.. అప్పుకి షాక్
Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 19వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో నగలు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు రాహుల్. దీంతో ఇంట్లో వారంతా రాహుల్‌ని నిలదీస్తారు. ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
పాన్ షాప్‌లో కిల్లీ, డబ్బు దొంగతనం చేశారంటూ రాజ్, కావ్య గురించి పోలీసులకు చెబుతాడు పాన్ షాప్ అతను. తామిద్దరం భార్యాభర్తలం, దొంగలం కాదని రాజ్ చెబుతాడు. నేను టూకి వెళ్లొచ్చేలోపు టూ మెంబర్స్ నా షాపులో దూరి అబద్ధాలు చెబుతారా అని షాప్ అతను అంటాడు. మీరు భార్యాభర్తలు అయితే ప్రూఫ్ చూపించండి అని పోలీసులు అడుగుతారు. దానికి మనం వినాయక చవితకి అంతా కలిసి ఫొటో దిగాం కదా అది చూపించండి అని కావ్య అంటుంది.
పక్కనే కదా అని
ఫోన్ తేలేదు అని రాజ్ అంటాడు. దానికి కావ్య కొపంతో లేస్తుంది. నన్ను ఫొన్ తేనివ్వలేదు. మీరు తేలేదు అని కావ్య అంటే.. పాన్ షాప్ పక్కనే కదా అని తేలేదు అని రాజ్ అంటాడు. కాస్తా ముందు జాగ్రత్త ఉండద్దు అని కావ్య అంటుంది. దీంతో ఇద్దరూ పోలీసుల ముందే గొడవ పడుతుంటారు. ఒకరి కుటుంబం గురించి మరొకరు మాటలు అనుకుంటూ ఉంటారు. అది చూసి విసిగిపోయిన పోలీసులు ఆపండి అని గట్టిగా అరుస్తారు.
మీరిద్దరు భార్యాభర్తలు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అని ఎస్సై అంటాడు. ఎలా సార్ అని కావ్య అంటే.. చనిపోయే వరకు అత్తింటివాళ్లను మాటలు అనేది భార్యాభర్తలే అని పోలీస్ అంటాడు. సార్ మరి దొంగతనం అని షాప్ అతను అంటే.. పాపం అతన్ని చూసి జాలి పడరా. అర్ధరాత్రి భార్య అడిగింది తేకుంటే సినిమా చూపిస్తార్రా. నాకు రోజు నాలుగు షోలు పడుతున్నాయి. భార్య అడిగినదానికి దొంగతనం చేసే అంతా దిగజారాడు అంటే.. వాడు మొగుడురా.. మొగాడురా అని పోలీసు అంటాడు.
ఇలాగే లేపుతారా
తర్వాత పాన్ షాప్ అతనికి డబ్బు ఇచ్చి రాజ్, కావ్య వెళ్లిపోతారు. మరోవైపు తెల్లవారు జామున చాలా హ్యాపీగా నిద్ర లేస్తుంది రుద్రాణి. కానీ, పక్కకు తిరిగి చూస్తే రుద్రాణి చీరలు కప్పుకుని కనకం పడుకుంటుంది. దీంతో కోపంతో కనకంను లేపుతుంది రుద్రాణి. ఏమైంది. ఈ ఇంట్లో ఇలాగే నిద్ర లేపుతారా అని కనకం అంటుంది. నా చీరలు ఎందుకు కప్పుకున్నావ్. అవి ఏమైనా నీలాంటి చీరలా. 30 వేల నుంచి లక్ష వరకు ఉంటాయి అని రుద్రాణి అంటుంది.
రాత్రి బాగా చలేసింది. దుప్పటి మీరే మొత్తం కప్పుకున్నారు. ఇంకో దుప్పటి కనపడకపోయేసరికి చీరలు కప్పుకున్నాను అని కనకం అంటుంది. నేను కనిపించకపోతే నా ఆస్తి తీసుకుంటావా అని రుద్రాణి అంటే.. మీకు అంత ఆస్తి ఉందా అని కనకం సెటైర్ వేస్తుంది. తర్వాత తన చీరలు మడతపెట్టి రుద్రాణికి ఇస్తుంది కనకం. నా కాస్టీలీ చీరలు అని రుద్రాణి బాధపడుతుంది. మరోవైపు రాహుల్‌కి మైఖేల్ కాల్ చేస్తాడు. దీంతో షాక్ అయిన రాహుల్ బెడ్ రూమ్ నుంచి పక్కకు వెళ్లిపోతాడు.
మైఖేల్ వార్నింగ్
రాహుల్ వెళ్లడాన్ని చూసిన స్వప్న అతని వెంట వెళ్తుంది. నాకు ఎందుకురా కాల్ చేశావ్ అని రాహుల్ అడిగితే.. నాకు బెయిల్ ఇప్పించాల్సి నువ్వేకదా అని మైఖేల్ అంటాడు. నేను ఎందుకు ఇప్పించాలిరా. నేరం చేసింది నువ్వు. శిక్ష అనుభవిస్తుంది నువ్వు అని రాహుల్ అంటాడు. నేరం, శిక్ష అని నువ్ మాట్లాడితే.. కిడ్నాప్, మర్డర్ అని నేను మాట్లాడాల్సి వస్తుంది. సొంత భార్యనే కిడ్నాప్ చేయించి మర్డర్ చేయమన్నావని చెబుతున్నాను. నువ్ మాట్లాడిన కాల్స్ రికార్డ్ చేశాను అని మైఖేల్ వార్నింగ్ ఇస్తాడు.
అదంతా చూస్తున్న స్వప్న.. రాహుల్ ఏంటీ సీరియస్‌గా ఉన్నాడేంటీ అని అనుకుంటుంది. రాహుల్ అని పిలుస్తుంది స్వప్న. అది విని షాక్ అవుతాడు రాహుల్. ఎమైంది ఎందుకు సీరియస్‌గా ఉన్నావ్. మళ్లీ ఏం చేస్తున్నావ్. ఏదైనా తప్పు చేస్తున్నావా అని స్వప్న నిలదీస్తుంది. నేను ఎందుకు చేస్తాను. ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. ఏదో హెల్ప్ కావాలంటా. నువ్ వెళ్లు అని స్వప్నను పంపిస్తాడు రాహుల్. అటునుంచి నా డార్లింగా.. ఏది ఫోన్ ఇవ్వు. రొమాంటిక్‌గా గుడ్ మార్నింగ్ చెబుతాను అని మైఖేల్ అంటాడు.
కల్యాణ్ ఎంట్రీ
నువ్వు చెప్పినట్లే బెయిల్ అరేంజ్ చేస్తాను అని రాహుల్ కాల్ కట్ చేస్తాడు. బెయిల్ ఎలా అరేంజ్ చేయాలి. వీడు ఇలాగే వాగుతుంటాడు. బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి వాన్ని ఫినిష్ చేయడం మంచిది అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు అప్పుకి కల్యాణ్ కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఎవరమ్మా అని కృష్ణమూర్తి అడిగితే.. రాంగ్ నెంబర్ అని అప్పు అంటుంది. అప్పుడే కాదు రైట్ నెంబరే అని కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో అప్పు, కృష్ణమూర్తి, పెద్దమ్మా షాక్ అవుతారు.
ఎన్ని సార్లు కాల్ చేసినా కట్ చేస్తావేంటీ. ఆన్సర్ చేసి ఏంటని తెలుసుకోరాదా. అసలు ఎందుకు కాల్ చేశాడని ఆలోచించవా. మీ అమ్మ చీరల కోసం పంపింది. నేను వచ్చే లోపు ప్యాక్ చేసి పెడతావని కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావ్. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను అని కల్యాణ్ అంటాడు. అప్పు అయిష్టంగా మాట్లాడటంతో.. కృష్ణమూర్తి వారిస్తాడు. వెళ్లి చీరలు తీసుకురమ్మంటాడు. దీంతో అప్పు చీరలు తీసుకొస్తుంది. నిన్ను కూడా రమ్మంది అని అప్పుని తీసుకెళ్తాడు కల్యాణ్.
సరదాగా ఏడిపిస్తూ
మరోవైపు కావ్య ఇంకా నిద్రలేవలేదని అంతా అనుకుంటారు. తను నిద్ర పోతుందేమో. మీలో ఎవరైనా టీ పెట్టండి అని సుభాష్ అంటాడు. ఇంతలో బయటి నుంచి రాజ్ కావ్య వస్తారు. కిల్లీ వాసన వస్తుందని ఎవరు ఏం అడిగిన మాట్లాడకూడదు అనుకుంటారు. లోపలికి వెళ్లి రాజ్ కావ్యను ఎక్కడికి వెళ్లారని అంతా అడుగుతారు. ఆయన బయటకు వెళ్దామంటే తోడుకు వెళ్లానని చెప్పి కావ్య ఎస్కేప్ అవుతుంది. నన్ను ఇరికించావ్ కదే అని రాజ్ అనుకుంటాడు. ఇంట్లో వాళ్లంతా రాజ్‌ను సరదాగా ఏడిపిస్తారు.