తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Craze In Hollywood: ఇది అమెరికానా లేక అమీర్ పేట.. ఆర్ఆర్ఆర్ థియేటర్లో చిందులేసిన విదేశీయులు..!

RRR Craze in Hollywood: ఇది అమెరికానా లేక అమీర్ పేట.. ఆర్ఆర్ఆర్ థియేటర్లో చిందులేసిన విదేశీయులు..!

01 October 2022, 18:42 IST

    • Americans Craze on RRR Movie: ఆర్ఆర్ఆర్ స్పెషల్ షో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రదర్శించారు. ఈ సినిమాపై మక్కువ పెంచుకున్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాటు నాటు స్టెప్పుకు స్టేజ్ ఎక్కి మరి డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు.
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (Twitter)

ఆర్ఆర్ఆర్

Foreigners Reaction on RRR: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఆరు నెలలు దాటినా.. ఈ సినిమా క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. తెలుగులోనో లేకా మనదేశంలో ఇతర ప్రదేశాల్లో ఈ క్రేజ్ ఉందంటే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మన దేశం కాదు. మన భాష కాదు.. కానీ ఈ సినిమా విదేశీయులతో ఈలలు, గోలలు, చిందులు.. ఒక్కటేమిటి మనం రెగ్యూలర్‌గా సినిమా హాళ్లలో కనిపించే హడావిడి అంతా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ థియేటర్లలో కనిపిస్తోంది. ఇక్కడ ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోను ప్రదర్శించడంతో హౌస్ ఫుల్ కావడమే కాకుండా.. థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు, గోలలు, కేరింతలు మాములుగా లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

సాధారణంగా హాలీవుడ్ ప్రేక్షకులు సినిమా చూసే శైలి మన వాళ్లకు చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు పెద్దగా రియాక్ట్ అవ్వరు. అలాంటింది ఆర్ఆర్ఆర్ సినిమా వారి వీక్షణ శైలిని పూర్తిగా మార్చి వేసింది. మన థియేటర్లలో మాస్ ప్రేక్షకులు మాదిరిగా కేరింతలు, ఈలలు, గోలలతో అదరగొట్టారు. సినిమా థియేటర్ స్క్రీన్ పై డ్యాన్సులు వేస్తూ తెలుగు వారిని తలపించారు. ముఖ్యంగా నాటు నాటు స్టెప్పుకు, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలకు పాశ్చాత్యులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస మోహన్.. ఈ వీడియోను ట్వీటర్ వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా ఇది అమెరికానా లేగా అమీర్ పేటా అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.