తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravanasura Twitter Review: రావ‌ణాసుర ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌వితేజ‌కు హ్యాట్రిక్ హిట్ ద‌క్కిందా? లేదా?

Ravanasura Twitter Review: రావ‌ణాసుర ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌వితేజ‌కు హ్యాట్రిక్ హిట్ ద‌క్కిందా? లేదా?

07 April 2023, 8:06 IST

  • Ravanasura Twitter Review: రావ‌ణాసుర సినిమాతో శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్నారు ర‌వితేజ‌. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే..

రావ‌ణాసుర
రావ‌ణాసుర

రావ‌ణాసుర

Ravanasura Twitter Review: ర‌వితేజ (Raviteja) హీరోగా న‌టించిన రావ‌ణాసుర సినిమా శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకురానుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ర‌వితేజ‌కు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టించారు. హీరోయిన్ పాత్ర‌ల్లో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ న‌టించారు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. రావ‌ణాసుర సినిమాకు ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ల‌భిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

లాయ‌ర్ క్రిమిన‌ల్‌గా మారితే...

ఈసినిమాలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని చెబుతోన్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ లాయ‌ర్ క్రిమిన‌ల్‌గా ఎలా మారాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌తో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా సాగుతుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

గ్రే షేడ్ క్యారెక్ట‌ర్‌లో చెల‌రేగిపోయాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సిల్వ‌ర్‌స్క్రీన్ ఎప్పుడూ చూడ‌నికొత్త ర‌వితేజ‌ను రావ‌ణాసుర‌లో చూస్తార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సుశాంత్ రోల్ యావ‌రేజ్ ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఫ‌స్ట్ హాఫ్ యావ‌రేజ్‌...

ఫ‌స్ట్ హాఫ్ క‌థ పెద్ద‌గా ఉండ‌ద‌ని, ర‌వితేజ శైలి కామెడీ టైమింగ్‌, హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్‌ల‌తో ద‌ర్శ‌కుడు టైమ్‌పాస్ చేశాడ‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. సెకండ‌ఫ్ మొత్తం ప్ర‌తి ప‌ది నిమిషాల‌కో ట్విస్ట్ వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాయ‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

హీరోయిన్లు ఐదుగురు ఉన్నా వారి పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.కేవ‌లం రొమాంటిక్ సీన్స్‌, పాట‌ల‌కు మాత్రమే హీరోయిన్లు ప‌రిమితం అయ్యార‌ని అంటున్నారు. ర‌వితేజ క్యారెక్ట‌ర్‌కు సంబంధించి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఇచ్చిన బీజీఎమ్ బాగుంద‌ని ట్వీట్స్ చేస్తోన్నారు. ఓవ‌రాల్‌గా ర‌వితేజ ఫ్యాన్స్‌ను రావ‌ణాసుర విజువ‌ల్ ట్రీట్‌ను ఇస్తుంద‌ని చెబుతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.