తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు

Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు

Hari Prasad S HT Telugu

11 May 2023, 17:59 IST

    • Ravi Teja Remuneration: వరుస ఫ్లాప్‌లు.. అయినా రెమ్యునరేషన్ పెంచేశాడు మాస్ మహారాజా రవితేజ. రావణాసుర మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైనా తన నెక్ట్స్ మూవీకి అతడు భారీ మొత్తం తీసుకుంటుండటం విశేషం.
రవితేజ
రవితేజ

రవితేజ

Ravi Teja Remuneration: మాస్ మహారాజా రవితేజ మరోసారి తన రెమ్యునరేషన్ పెంచేశాడు. గత కొన్నాళ్లుగా ధమాకా, వాల్తేర్ వీరయ్య తప్ప పెద్దగా హిట్లు లేని ఈ హీరో.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యే వచ్చిన రావణాసుర కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ధమాకా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన తర్వాత ఈ రావణాసురపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

కానీ సినిమా మాత్రం అతన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్న అతడు.. ఆ తర్వాత కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ మాత్రం తన ఫీజు పెంచేస్తుండటం విశేషం.

ధమాకా కంటే ముందు అతడు నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, రామారావ్ ఆన్ డ్యూటీలాంటి సినిమాలు విఫలమయ్యాయి. అయినా అతడు అడుగుతున్న భారీ రెమ్యునరేషన్లకు ప్రొడ్యూసర్లు సరే అంటున్నారు. ఇక రవితేజ, సందీప్ రాజ్ మూవీలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడని, ఈ ఇద్దరూ టీచర్, స్టూడెంట్ పాత్రల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. మరోవైపు రవితేజ ఈగల్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.