Tiger Nageswara Rao Release Date: టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరాకి వస్తున్నాడు-tiger nageswara rao release date announced on wednesday march 29th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tiger Nageswara Rao Release Date Announced On Wednesday March 29th

Tiger Nageswara Rao Release Date: టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరాకి వస్తున్నాడు

Hari Prasad S HT Telugu
Mar 29, 2023 02:54 PM IST

Tiger Nageswara Rao Release Date: టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మాస్ మహారాజా రవితేజ ఈసారి దసరాకి వస్తున్నాడు. అతనికిదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ డేట్ ఫిక్స్
టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ డేట్ ఫిక్స్

Tiger Nageswara Rao Release Date: టైగర్ నాగేశ్వర రావు మూవీ రిలీజ్ డేట్ ను బుధవారం (మార్చి 29) మేకర్స్ అనౌన్స్ చేశారు. రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ దొంగ బయోపిక్ అయిన ఈ మూవీని వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 24న ఉండగా.. అక్టోబర్ 20న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో ఓ రైలుపై నిల్చొని ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ లుక్ తో ఉంది. ఈ టైగర్ నాగేశ్వర రావు తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో రిలీజ్ కాబోతోంది. 1970ల్లో ఓ పేరు మోసిన దొంగ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

1970ల్లో చెన్నై జైలు నుంచి తప్పించుకున్న తర్వాత నాగేశ్వర రావు ఎవరో బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అతనికి టైగర్ అనే పేరు వచ్చింది. ఈ బయోపిక్ లో అతని క్యారెక్టర్ లో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తోపాటు రేణు దేశాయ్ కూడా ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర కూడా ఈ మూవీలో ఉన్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ కింద ఈ టైగర్ నాగేశ్వర రావు రూపొందుతోంది. ధమాకా, వాల్తేర్ వీరయ్యలాంటి వరుస హిట్స్ తో ఊపు మీదున్న రవి తేజ త్వరలోనే రావణాసురుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అతని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఈ టైగర్ నాగేశ్వర రావు.

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్ గా మారిపోవాలని చూస్తున్నారు. ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. దసరాతో నానిలాంటి వాళ్లు పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇప్పుడు రవితేజ కూడా వాళ్ల జాబితాలో చేరనున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం