తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor On Pakistani Film: పాకిస్థానీ సినిమాలో నటించాలని ఉంది: రణ్‌బీర్‌ కపూర్‌

Ranbir Kapoor on Pakistani film: పాకిస్థానీ సినిమాలో నటించాలని ఉంది: రణ్‌బీర్‌ కపూర్‌

HT Telugu Desk HT Telugu

12 December 2022, 21:36 IST

    • Ranbir Kapoor on Pakistani film: పాకిస్థానీ సినిమాలో నటించాలని ఉందని అన్నాడు బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌. కళాకారులకు సరిహద్దులు ఉండవని అతడు అనడం విశేషం.
రణ్‌బీర్‌ కపూర్‌
రణ్‌బీర్‌ కపూర్‌ (AFP)

రణ్‌బీర్‌ కపూర్‌

Ranbir Kapoor on Pakistani film: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ పాకిస్థానీ సినిమాలో నటించడంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ మధ్యే అతడు సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై మాట్లాడాడు. అంతేకాదు అతన్ని వెరైటీ ఇంటర్నేషనల్‌ వాన్‌గార్డ్‌ యాక్టర్‌ అవార్డుతోనూ నిర్వాహకులు సత్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

అయితే ఈ సందర్భంగా ఓ పాకిస్థానీ ఫిల్మ్‌ మేకర్‌ రణ్‌బీర్‌ను ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. తన దగ్గర ఓ స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నదని, తన టీమ్‌తో కలిసి పాకిస్థాన్‌ టీమ్‌తో పని చేయడం మీకు సమ్మతమేనా అని అతడు అడిగాడు. చాలా ఏళ్లుగా ఇండియా, పాకిస్థాన్‌ నటీనటులు ఒకరి ఇండస్ట్రీలో మరొకరు నటించడంపై నిషేధం ఉన్నదని, ఈ నేపథ్యంలో సౌదీలాంటి మరో చోట తమతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని పాకిస్థానీ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశ్నించాడు.

"మనకు సౌదీ అరేబియాలాంటి ఓ ప్లాట్‌ఫామ్‌ ఉంది. ఇక్కడ మనం కలిసి సినిమాలు తీయొచ్చు. ఓ సినిమాకు మీతో సైన్‌ చేయాలని నేను అనుకుంటున్నాను. మీ టీమ్‌తో కలిసి సౌదీ అరేబియాలో మా టీమ్‌తో పని చేస్తారా" అని అతడు అడిగాడు. దీనికి రణ్‌బీర్‌ సరేనన్నాడు.

"కచ్చితంగా సర్. కళకారులకు సరిహద్దులు ఉండవని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కళలకు. మౌలా జాట్‌ కోసం పాకిస్థానీ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి శుభాకాంక్షలు. గత కొన్నేళ్లలో మనం చూసిన అతిపెద్ద హిట్స్‌లో ఇదీ ఒకటి. నేను కూడా పాకిస్థానీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నా" అని రణ్‌బీర్‌ అన్నాడు.

పాకిస్థానీ నటులు ఫవద్‌ ఖాన్, మహీరా ఖాన్‌ కలిసి నటించిన ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జాట్‌ గత అక్టోబర్‌లో రిలీజైంది. ఈ ఇద్దరు నటులు ఇండియన్‌ సినిమాల్లో నటించారు. మహీరా.. షారుక్‌తో కలిసి రయీస్‌లో నటించింది. ఇక ఫవద్‌ అయితే రణ్‌బీర్‌తో కలిసి యే దిల్‌ హై ముష్కిల్‌, ఖూబ్‌సూరత్‌లాంటి సినిమాల్లో నటించాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.