Alia Ranbir Daughter name: తమ కూతురికి రహా అనే పేరు పెట్టిన రణ్‌బీర్‌ ఆలియా.. అర్థమేంటో తెలుసా?-alia ranbir daughter name is raha and here is the meaning of the name ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Alia Ranbir Daughter Name Is Raha And Here Is The Meaning Of The Name

Alia Ranbir Daughter name: తమ కూతురికి రహా అనే పేరు పెట్టిన రణ్‌బీర్‌ ఆలియా.. అర్థమేంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 08:02 PM IST

Alia Ranbir Daugher name: తమ కూతురికి రహా అనే పేరు పెట్టిన రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంట. ఆ పేరుకు అర్థమేంటో కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఆలియా వివరించింది.

ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌
ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ (Instagram/@aliaabhatt)

Alia Ranbir Daugher name: బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ఈ మధ్యే పేరెంట్స్‌ అయిన విషయం తెలుసు కదా. ఆలియా ఓ పాపకు జన్మనిచ్చింది. తాజాగా తమ పాప పేరేంటో వీళ్లు రివీల్‌ చేశారు. ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా పాప పేరు రహా అని వెల్లడించింది. అంతేకాదు దానికి వివిధ భాషల్లో ఉన్న వివిధ అర్థాలను కూడా వివరించింది.

ట్రెండింగ్ వార్తలు

రహా అనే పేరులోనూ తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఈ జంట చూసుకుంది. రణ్‌బీర్‌ నుంచి ర, ఆలియా నుంచి ఆ అనే ఇంగ్లిష్‌ అక్షరాలను వీళ్లు ఎంపిక చేసుకొని తమ పాపకు రహా అనే పెట్టుకున్నారు. ఈ పేరును పాపకు రణ్‌బీరే పెట్టాడని కూడా ఆలియా ఈ సందర్భంగా చెప్పింది.

"తన తెలివైన, అద్భుతమైన డాడీ పెట్టిన రహా అనే పేరుకు ఎన్నో అందమైన అర్థాలు ఉన్నాయి. అసలు స్వచ్ఛమైన రూపంలో అయితే ఈ పేరుకు దైవిక మార్గం అని అర్థం. ఇక స్వాహిలి భాషలో జాయ్‌ అని, సంస్కృతంలో వంశం అని, అరబిక్‌లో శాంతి అని అర్థం. అంతేకాదు దీనికి సంతోషం, స్వేచ్ఛ, గొప్ప ఆనందం అనే అర్థాలు కూడా ఉన్నాయి. పాపకు సరిగ్గా సరిపోయే పేరు ఇది. ఆమె పుట్టినప్పటి నుంచీ ఇవన్నీ మేము ఫీలయ్యాం. మన కుటుంబానికి జీవం ఇచ్చినందుకు థ్యాంక్యూ రహా. మా జీవితాలు కొత్తగా ప్రారంభమైనట్లుగా అనిపిస్తోంది" అని ఆలియా తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది.

దీంతోపాటు పాపను ఇద్దరూ ఎంతో మురిపెంగా చూసుకుంటున్న ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఇక బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు రణ్‌బీర్‌ పెద్ద అభిమాని కావడంతో ఆ ఫొటోలో ఆ టీమ్‌ జెర్సీ వెనుక రహా పేరు కూడా పెట్టుకున్నారు. వీళ్లకు నవంబర్‌ 6న రహా జన్మించింది. రణ్‌బీర్‌, ఆలియాలు ఏప్రిల్‌ 14న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.