తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Pre Release Promo: బ్రహ్మాస్త్ర నుంచి ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. ఇందులో ఏం చూపించారంటే?

Brahmastra Pre Release Promo: బ్రహ్మాస్త్ర నుంచి ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. ఇందులో ఏం చూపించారంటే?

03 September 2022, 20:04 IST

    • Brahmastra Pre Release Promo: రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రోమో వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో లేని సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు.
బ్రహ్మాస్త్ర ప్రి రీలీజ్ ప్రోమో
బ్రహ్మాస్త్ర ప్రి రీలీజ్ ప్రోమో (Twitter)

బ్రహ్మాస్త్ర ప్రి రీలీజ్ ప్రోమో

Brahmastra Pre Release Promo Release: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకు అయ్యన్ ముఖర్జి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్లు, ప్ర్తత్యేక వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మరో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోను గమనిస్తే.. ట్రైలర్‌లో లేనివి, సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇందులో చూపించారు. అంతేకాకుండా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఈ వీడియో ద్వారా తెలిపారు.

ఈ చిత్రాన్ని తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేయనున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుందని చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. అంతేకాకుండా హాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఈ సినిమాను గ్లోబల్ స్థాయి దిశగా తీసుకెళ్తోంది.

రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.