తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kiran Abbavaram Movie Postponed: నేను మీకు బాగా కావాల్సినవాడినే సినిమా వాయిదా.. ఎప్పుడొస్తుందంటే?

Kiran Abbavaram Movie Postponed: నేను మీకు బాగా కావాల్సినవాడినే సినిమా వాయిదా.. ఎప్పుడొస్తుందంటే?

03 September 2022, 19:41 IST

    • Kiran Abbavaram NMBK: కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. తొలుత సెప్టెంబరు 9న విడుదల చేయాలని భావించగా.. తాజాగా ఆ తేదీని మార్పు చేసింది.
నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్ర విడుదల వాయిదా
నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్ర విడుదల వాయిదా

నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్ర విడుదల వాయిదా

NMBK on September 16: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మరోసారి ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా అతడు నటించిన సరికొత్త చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రత్యేక గీతంలో కిరణ్ తనదైన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాజాగా ఈ విడుదల తేదీని వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రాన్ని సెప్టెంబరు 9న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా వాయిదా వేసింది. సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కిరణ్ రాడ్ పట్టుకుని మాస్ లుక్‌లో అదరగొట్టాడు.

శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, దివ్యా రాధన్ హీరోయిన్లుగా చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

ఇటీవల విడుదలైన ఐటెమ్ నెంబర్‌లో కిరణ్ అబ్బవరం దుమ్మురేపాడు. తనదైన శైలి స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మామ అంటూ ఈ పాట ఆకట్టుకుంది. ఆ పాటను సాకేత్ కొమండూరి, కేతన శర్మ ఆలపించారు. కాసర్ల శ్యామ్ పాటకు సాహిత్యాన్ని అందించాడు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.