తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor New Movie Brahmastra First Review And Rating From Uae In Telugu

Brahmastra First Review: విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

06 September 2022, 12:21 IST

    • Brahmastra First Review in twitter: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. యూఏఈ ప్రీమియర్‌ షోను చూసిన సినీ విమర్శకులు ట్విటర్ వేదికగా తమ స్పందనను తెలియజేశారు.
బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ
బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ (Twitter)

బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ

Brahmastra first review from UAE: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆలియా భట్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. ఆలియా-రణ్‌బీర్ కలిసి చేసిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే విడుదలకు ముందే యూఏఈలో ప్రదర్శించిన ప్రీమియర్ షో ఆధారంగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

యూకే, యూఏఈలో ఫ్యాషన్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్ సంధు అనే సమీక్షకుడు బ్రహ్మాస్త్ర మొదట రివ్యూను చెప్పేశారు. ట్విటర్ వేదికగా ఈ సినిమా ఎలా ఉందో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చారు.

బ్రహ్మాస్త్ర చిత్రం విజువల్స్ పరంగా ఉన్నతస్థాయిలో ఉందని, విజువల్ వండర్ అని చెప్పవచ్చని ఆయన తెలిపారు. అయితే కొన్ని సన్నివేశాల్లో మరింత గొప్పగా గ్రాఫిక్స్‌ను మెరుగుపరచాల్సిందిగా తెలిపారు. కళ్లు చెదిరే రీతిలో సినిమాటోగ్రఫీ ఉందని, అయితే కొన్ని చోట్ల లైటింగ్ మరి చీకటిగా ఉందని తెలిపారు. ప్రొడక్షన్ డిజైనింగ్ అద్బుతంగా ఉందని, స్టోరీ, స్క్రీన్ ప్లే ఫర్వాలేదని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్‌లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని ఉమర్ స్పష్టం చేశారు.

సంగీతం ఫస్ట్ క్లాస్‌లో ఉందని, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. నటీనటుల పర్ఫార్మెన్స్ దగ్గరకొస్తే.. రణ్‌బీర్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారట. తన పాత్ర ఉన్నంత సేపు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతాడని తెలిపారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తారని, ఆయన ఉన్నంత సేపు చూపు బిగ్‌బీపైనే ఉంటుందని స్పష్టం చేశారు. మౌనీ రాయ్ దగ్గరకొస్తే.. ఆమె ఇంకా నాగినీ మోడ్‌లో నుంచి రానట్లుందని, కొన్ని చోట్ల ఆమెను చూస్తే విసుగొస్తుందని అన్నారు. ఆలియా భట్ ఎప్పటిలాగానే క్యూట్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో ఎమోషన్ తగ్గిందని ఉమర్ తెలిపారు. పబ్లిసిటీ బాగా చేసినందుకు వీకెండ్ వరకు బాగా కలెక్షన్లు వస్తాయని స్పష్టం చేశారు. అయితే చిత్రబృందం అనుకున్నస్థాయిలో వసూళ్లు ఉండవని పేర్కొన్నారు. కొన్ని చోట్ల సినిమాను ముందుగానే ఊహించడం ప్రేక్షకులకు బోర్‌ ఫీల్ అయ్యేలా చేస్తుందని తెలిపారు. అయితే సినిమాలో ఉన్న సన్నివేశాలన్నింటిలో కంటే కూడా షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇవ్వడం బ్రహ్మాస్త్రలో హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. మొత్తంగా ఉమర్ సంధు ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. 5 స్టార్లకుగాను 2.5 ఇచ్చారు.

రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.