తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Pareshan Kallu Dawat: నాకు ఎక్కాలంటే చాలా టైమ్ పడుతుంది.. రానా కల్లు దావత్ చూశారా?

Rana Pareshan Kallu Dawat: నాకు ఎక్కాలంటే చాలా టైమ్ పడుతుంది.. రానా కల్లు దావత్ చూశారా?

Hari Prasad S HT Telugu

25 May 2023, 18:54 IST

    • Rana Pareshan Kallu Dawat: నాకు ఎక్కాలంటే చాలా టైమ్ పడుతుంది అంటూ రానా కల్లును ఫుల్లుగా తాగేశాడు. అతని పరేషాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా కల్లు దావత్ పేరుతో ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
రానాకు కల్లు పోస్తున్న గంగవ్వ
రానాకు కల్లు పోస్తున్న గంగవ్వ

రానాకు కల్లు పోస్తున్న గంగవ్వ

Rana Pareshan Kallu Dawat: రానాకు తాగింది ఎక్కాలంటే చాలా టైమ్ పడుతుందట. ఈ విషయాన్ని అతడే చెప్పాడు. అతడు సమర్పకుడిగా ఉన్న పరేషాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రానా కల్లు దావత్ చేసుకున్నాడు. మూవీ టీమ్ తోపాటు గంగవ్వతో కలిసి కల్లు కూడా తాగాడు. అప్పుడే తనకు అంత తొందరగా ఎక్కదని, రోజంతా కూర్చోవాల్సి వస్తుందని రానా అనడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

ఈ పరేషాన్ మూవీ టీమ కల్లు దావత్ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో తీసిన మరో సినిమా ఈ పరేషాన్. ఏ పనీపాటా లేకుండా తిరిగే ఓ యువకుడు ప్రేమలో పడితే ఎదురయ్యే పరేషాన్లను ఫన్నీగా చూపించారు. ఈ మధ్యే ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. జూన్ 2న ఈ పరేషాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పల్లె వాతావరణంలో చెట్టు కింద కల్లు దావత్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ దావత్ కు మూవీలో లీడ్ రోల్స్ కనిపించిన నటీనటులతోపాటు ఇతర సాంకేతిక సిబ్బంది, గంగవ్వ, రానా వచ్చారు. స్పెషల్ గెస్టుగా వచ్చిన రానాకు గంగవ్వ కల్లు పోయడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఆ కల్లు తాగుతూ ఇందులో ఈగలు, చీమలు కూడా ఉన్నాయంటూ రానా సరదాగా కామెంట్ చేస్తాడు. ఇక ఆ టీమ్ తో కూర్చొని సినిమా గురించి ముచ్చటించాడు రానా. ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా సరదాగా సాగిపోయింది. ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో, ఇక్కడి యాసతో వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆ కోవలోకి చెందినదే ఈ పరేషాన్ మూవీ కూడా.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.