Gangavva On Chandrababu : నేను మాట జారిపోతే క్షమించండి, చంద్రబాబుకు గ్రహణం వ్యాఖ్యలపై గంగవ్వ వివరణ-gangavva apology to tdp chief chandrababu lokesh eclipse comment video viral ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gangavva On Chandrababu : నేను మాట జారిపోతే క్షమించండి, చంద్రబాబుకు గ్రహణం వ్యాఖ్యలపై గంగవ్వ వివరణ

Gangavva On Chandrababu : నేను మాట జారిపోతే క్షమించండి, చంద్రబాబుకు గ్రహణం వ్యాఖ్యలపై గంగవ్వ వివరణ

Bandaru Satyaprasad HT Telugu
May 24, 2023 05:34 PM IST

Gangavva On Chandrababu : చంద్రబాబుకు గ్రహణం పట్టిందన్న వ్యాఖ్యలపై గంగవ్వ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.

చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు
చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు

Gangavva On Chandrababu : యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన గంగవ్వ... ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై గంగవ్వ క్షమాపణలు చెప్పారు. ఓ ఛానల్ వాళ్లు అనమంటే అన్నానని వివరణ ఇచ్చారు. మై విలేజ్ షోతో క్రేజ్ సాధించిన గంగవ్వ.. బిగ్ బాస్ హౌస్ లో కూడా ప్రవేశించింది. ఇటీవల సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. అప్పుడప్పుడూ టీవీ షోలలో తళుక్కున మెరుస్తున్న గంగవ్వ ఈ ఏడాది ఉగాదికి ఓ ఛానల్ వాళ్లు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు గ్రహణం పట్టిందన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు చంద్రబాబును ట్రోల్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గంగవ్వ క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

చంద్రబాబుకు గ్రహణం

ఈ ఏడాది ఉగాది నాడు ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొంది. ఈ షోలో భాగంగా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను గంగవ్వతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలను చూపించగా వాటిని చూసి జాతకం చెప్పనంటూ షో నుంచి లేచి వెళ్లిపోతుంది గంగవ్వ. కానీ ఛానల్ వాళ్లు మళ్లీ అడగగా చంద్రబాబుకు గ్రహణం పట్టిందని గంగవ్వ అంటుంది. ఈ వీడియోని ఎడిట్ చేసి నెటిజన్లు చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు.

గంగవ్వ క్షమాపణలు

అప్పుడు ఏ సందర్భంగా అలా మాట్లాడానే గంగవ్వ వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై బాధపడుతున్నానంటూ గంగవ్వ అన్నారు. టీవీ ఛానల్ వారు చెప్పమంటేనే అలా చెప్పానని తన మాటలు ఇబ్బంది పెట్టిఉంటే క్షమించాలని గంగవ్వ ఉద్వేగానికి లోనైయ్యారు. గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియోను టీడీపీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

"అందరికీ నమస్కారం. వాళ్లు ఏదైనా చెబితేనే అంటాను. నేను చదువుకోలేదు. నా కష్టం అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు సార్ నేను అననంటే... టీవీ ఛానల్ వాళ్లు వచ్చి అనిపించారు. దాన్ని మీరు తప్పుపట్టుకోకుండి. దయచేసి నన్ను క్షమించండి. నాకు ఇదంతా తెలియదు. నన్ను అనమంటేనే అన్నాను. మీరందరూ సపోర్టు చేయబట్టి నాకు గూడయింది. నేను మాట జారిపోతే క్షమించండి" - గంగవ్వ

బుల్లితెరపై

యూట్యూబ్ లో మై వీలేజ్ షో తో తెరమీదకు వచ్చిన గంగవ్వ... తెలంగాణ యాస చేసి స్కిట్లు పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు బిగ్ బాస్ షో లో ఎంట్రీ కూడా దొరికింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గంగవ్వ హీరోలను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇలా పేరు సంపాదించిన ఆమె.. ఇటీవల కాలంలో గంగవ్వకు సినిమాల్లో కూడా ఛాన్స్ లు వస్తున్నాయి.

IPL_Entry_Point