తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan To Rajamouli Says Can Not Wait To See Him Conquer The World Cinema

Ram charan to Rajamouli: మీరు ప్రపంచ సినిమాను జయించాలి: రాజమౌళికి రామ్‌చరణ్‌ స్పెషల్‌ మెసేజ్‌

HT Telugu Desk HT Telugu

13 December 2022, 20:35 IST

    • Ram charan to Rajamouli: మీరు ప్రపంచ సినిమాను జయిస్తే చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ రాజమౌళికి రామ్‌చరణ్‌ స్పెషల్‌ మెసేజ్‌ పంపించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ కావడంపై చెర్రీ ఇలా స్పందించాడు.
రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

Ram charan to Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జైత్రయాత్రకు, అవార్డుల వేటకు అడ్డే లేకుండా పోతోంది. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో నామినేట్‌ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Ramayanam: రామాయణం నుంచి లీకైన సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఫొటోలు.. మీరు చూశారా?

Adah Sharma Horror Movie: హార‌ర్ మూవీతో భ‌య‌పెట్ట‌బోతున్న‌ అదాశ‌ర్మ - సీడీ ట్రైల‌ర్ రిలీజ్‌

OTT Best Movies: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. 4 డిఫరెంట్ జోనర్.. ఎక్కడ చూడాలంటే?

Manjummel Boys OTT: అఫీషియ‌ల్ - మంజుమ్మ‌ల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - రెండు రోజులు ఆల‌స్యంగా స్ట్రీమింగ్‌

ఆస్కార్స్‌ దిశగా ఇలా మరో అడుగు ముందుకు వేసినట్లయింది. గోల్డెన్‌ గ్లోబ్స్‌లో బెస్ట్ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీలో రామ్‌ క్యారెక్టర్‌ పోషించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి ట్విటర్‌ ద్వారా ఓ స్పెషల్‌ మెసేజ్‌ పంపించాడు.

"ఇది ఎంతో గర్వించదగిన క్షణం రాజమౌళి గారు! మీరు ప్రపంచ సినిమాను జయిస్తుంటే చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ నామినేషన్స్‌ పొందడం గర్వంగా ఉంది. టీమ్‌ ఆర్ఆర్ఆర్‌కు కంగ్రాచులేషన్స్‌" అని రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశాడు.

అటు ఈ మూవీలో భీమ్‌ క్యారెక్టర్‌ పోషించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ నామినేషన్స్‌పై స్పందించాడు. "గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రెండు కేటగిరీల్లో నామినేట్ కావడం సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు.. ఆతృతగా ఎదురు చూస్తుంటాను" అని తారక్‌ ట్వీట్‌ చేశాడు.

అంతకుముందు ప్రభాస్‌ కూడా ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌ చెప్పాడు. "గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు ఆర్‌ఆర్‌ఆర్‌ నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తోపాటు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు" అని ప్రభాస్‌ ట్వీట్‌ చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.