RRR for Oscars: వావ్‌.. ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాయమేనా.. కేటగిరీ కూడా ఖరారు అయిందిగా!-rrr for oscars as the movie may be nominated in visual effects category ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr For Oscars As The Movie May Be Nominated In Visual Effects Category

RRR for Oscars: వావ్‌.. ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాయమేనా.. కేటగిరీ కూడా ఖరారు అయిందిగా!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 04:26 PM IST

RRR for Oscars: వావ్‌.. ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కేటగిరీ కూడా ఖరారు అయినట్లు ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ వెరైటీ ఓ కథనం ప్రచురించింది.

ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

RRR for Oscars: దర్శక ధీరుడు రాజమౌళి శ్రమ ఫలించనుందా? ఇండియా నుంచి అధికారికంగా కాకపోయినా ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ నామినేట్‌ కానుందా? ఇప్పటికే ఏ కేటగిరీ అన్నది కూడా ఫైనల్ అయిపోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒక కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అకాడెమీ అవార్డులకు నామినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ వెరైటీ వెల్లడించింది.

95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం 2023, మార్చి 12న జరగనుంది. దీనికోసం రాజమౌళి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఇండియా నుంచే అధికారిక ఎంట్రీగా ఆర్‌ఆర్ఆర్ ఉంటుందని భావించినా.. అది జరగలేదు. దీంతో నేరుగా ఎంట్రీ కోసం అతడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అమెరికాలో విస్తృతంగా మూవీ ప్రమోషన్లు నిర్వహించాడు. "మీ పరిశీలనకు" సెక్షన్‌లో ఈ మూవీని ఆస్కార్స్‌కు రాజమౌళి సమర్పించాడు.

ఇప్పుడతని శ్రమ ఫలించేలా కనిపిస్తోంది. వెరైటీ మ్యాగజైన్‌ ప్రకారం.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో ఈ సినిమా నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ మూవీ హాలీవుడ్‌ మూవీస్‌ టాప్‌ గన్‌ 2, అవతార్‌ 2, బ్లాక్‌ పాంథర్‌ 2, ది బ్యాట్‌మ్యాన్ మూవీలతో పోటీ పడనుంది. అమెరికాతోపాటు జపాన్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ బెస్ట్‌ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నాడు. ఇప్పుడీ మూవీ ఆస్కార్స్‌కు నామినేట్‌ అయినా కూడా ఈ టీమ్‌ శ్రమ ఫలించినట్లే. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జపాన్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. అక్టోబర్‌ 21న రిలీజైన ఈ సినిమా.. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్‌ సినిమాగా నిలిచింది.

IPL_Entry_Point